ఇద్దరు పిల్లలతో మహిళ అదృశ్యం
కుషాయిగూడ: కాప్రాలోని అరుల్‌నగర్ కాలనీకి చెందిన శిరీష (29) ఇద్దరు పిల్లలతో కలిసి అదృశ్యమైంది. పోలీసుల వివరాల ప్రకారం.. శిరీషకు 2019లో దమ్మాయిగూడకు చెందిన సాయికుమార్‌గౌడ్‌తో వివాహమైంది. వీరికి అయాన్ష్ (7), రుద్రాక్ష (4) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో గత మూడు నెలలుగా పిల్లలతో కలిసి ఆమె పుట్టింట్లో ఉంటోంది. ఈ నెల 25న రాత్రి భర్తతో ఫోన్‌లో మాట్లాడుతున్న సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మరుసటి రోజు ఉదయం 8.15 గంటలకు పిల్లలను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. తన సెల్‌ఫోన్‌ను ఇంట్లోనే వదిలివెళ్లింది. భర్త ఇంటికి వెళ్లిందేమోనని కుటుంబ సభ్యులు ఆరా తీయగా అక్కడికి రాలేదని తెలిసింది. బంధువులు, తెలిసిన వారి ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో తండ్రి గుండ్ల శ్రీనివాస్‌గౌడ్ కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఆచూకీ తెలిపితే సమాచారం ఇవ్వండి: శిరీష ఎత్తు 5.6 అడుగులు, చామనఛాయ రంగు కలిగి ఉంటుంది. చివరిసారిగా ఆకుపచ్చ రంగు చుడీదార్ ధరించింది. తెలుగు, ఆంగ్ల భాషలు మాట్లాడగలదు. ఆమె ఆచూకీ తెలిసిన వారు కుషాయిగూడ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.