జేఎన్‌టీయూఏలో 9 మందికి ఉద్యోగాలు..
అనంతపురం విద్య మేజర్ న్యూస్:-జేఎన్‌టీయూఏ ఇంజినీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ చివరి సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో 9 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. హెల్త్ కేర్ నౌ సంస్థ నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో 60 మంది విద్యార్థులు పాల్గొనగా, 20 మంది రాత పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ముఖాముఖి ఇంటర్వ్యూల అనంతరం 9 మందిని ఎంపిక చేసి, ఏడాదికి రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు వేతనం ప్రకటించారు.
ఎంపికైన విద్యార్థులను ఉపకులపతి ఆచార్య హెచ్. సుదర్శన రావు, రిజిస్ట్రార్ ఆచార్య బి. దుర్గాప్రసాద్, ఓఎస్డీ ఆచార్య ఎన్. దేవన్న, ఆచార్య ఎస్. వసుంధర, కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పి. చెన్నారెడ్డి, ఉపప్రిన్సిపాల్ ఆచార్య బి. దిలీప్ కుమార్ అభినందించారు.
మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..