BREAKING
ఇద్దరు పిల్లలతో మహిళ అదృశ్యం రాజ్యాంగ రక్షణకు కేఎల్ఆర్‌ కదం! అభ్యర్థులు లేకుండానే హోరాహోరీగా ప్రచారం రంగంలోకి దిగిన కుటుంబ సభ్యులు.. పోటాపోటీగా నాయకుల పర్యటనలు జేఎన్‌టీయూఏలో 9 మందికి ఉద్యోగాలు.. టీడీపీకి ఇంటిపోరు.. వైసీపీకి కలిసొచ్చేనా? రెబల్స్‌ ఎఫెక్ట్‌ ఎవరికి లాభం.. ఎవరికి నష్టం? గుర్తులతో కూడిన కండువాలను బహుకరించిన రాజేష్ జేఎన్‌టీయూఏలో రెండు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు.. బజాజ్ ఆటో ఫౌండేషన్‌తో కీలక ఒప్పందానికి ముందడుగు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి: DMHO డా. కళ్యాణ్ చక్రవర్తి ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం.. నంది సర్కిల్లో అర్ధాంతరంగా ఆగిపోయిన సిసి రోడ్డు పనులు ప్రారంభం.. గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదును వేగవంతం చేయాలి – కలెక్టర్ నారాయణ రెడ్డి రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.. జేఎన్‌టీయూ వీసీ ఆచార్య హెచ్ సుదర్శన్ రావు జ్యోతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఎస్.వి. డిగ్రీ, పీజీ కళాశాలలో ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహణ జిల్లా స్థాయి PPT పోటీల్లో ఆరుగురికి రాష్ట్ర స్థాయి అవకాశం

నంది సర్కిల్లో అర్ధాంతరంగా ఆగిపోయిన సిసి రోడ్డు పనులు ప్రారంభం..

Select Suryaa Now
నంది సర్కిల్లో అర్ధాంతరంగా ఆగిపోయిన సిసి రోడ్డు పనులు ప్రారంభం..

హిందూపురం టౌన్ మేజర్ న్యూస్:

హిందూపురం పట్టణంలోని రైల్వే రోడ్డులో 100 అడుగుల జాతీయ పతాకం వద్ద, నంది సర్కిల్ లో అర్ధాంతరంగా ఆగిపోయిన సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ ఆదేశాల మేరకు 
మున్సిపల్ చైర్మన్ పి.ఎస్. మంజునాథ్ ప్రత్యేక చొరవ తీసుకొని ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడంతో ఈ సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
రోడ్డు ఏర్పాటు పనులను చైర్మన్, టిడిపి పట్టణ అధ్యక్షులు వెంకటేష్, సీనియర్ నాయకులు మంగేష్, రోడ్ల అభివృద్ధి శాఖ కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రమోహన్, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ నిమ్మకాయల రాము, ఎస్సీ సెల్ రవికుమార్ పరిశీలించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, ప్రజలకు ఇబ్బంది లేకుండా రోడ్డు పనులను త్వరగా పూర్తి చేస్తామని, పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.

 

నేటి దినపత్రిక సూర్య టౌన్ రిపోర్టర్ నాగరాజు, హిందూపురం 

---