BREAKING
జేఎన్‌టీయూఏలో రెండు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు.. బజాజ్ ఆటో ఫౌండేషన్‌తో కీలక ఒప్పందానికి ముందడుగు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి: DMHO డా. కళ్యాణ్ చక్రవర్తి ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం.. నంది సర్కిల్లో అర్ధాంతరంగా ఆగిపోయిన సిసి రోడ్డు పనులు ప్రారంభం.. గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదును వేగవంతం చేయాలి – కలెక్టర్ నారాయణ రెడ్డి రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.. జేఎన్‌టీయూ వీసీ ఆచార్య హెచ్ సుదర్శన్ రావు జ్యోతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఎస్.వి. డిగ్రీ, పీజీ కళాశాలలో ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహణ జిల్లా స్థాయి PPT పోటీల్లో ఆరుగురికి రాష్ట్ర స్థాయి అవకాశం గ్రామాల్లో పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలి.. కాటసాని చిన్నారులకు పౌష్టికాహారం, ప్రాథమిక విద్యే లక్ష్యం కేసీఆర్‌పై అభిమానంతో పాదయాత్ర తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి 30న లోక్‌సభ, 2న రాజ్యసభ ప్రత్యేక సమావేశాలు.. రాజ్యాంగ స్ఫూర్తితో ఉత్తమ పౌరులుగా ఎదగాలి

ఎస్.వి. డిగ్రీ, పీజీ కళాశాలలో ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహణ

Select Suryaa Now
ఎస్.వి. డిగ్రీ, పీజీ కళాశాలలో  ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహణ

అనంతపురం విద్య మేజర్ న్యూస్:- ఎస్.వి. డిగ్రీ, పీజీ కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు కళాశాల వైస్ చైర్మన్ సి. చక్రధర రెడ్డి పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూతన విద్యార్థులకు కళాశాల విద్యా విధానం, క్రమశిక్షణ, పరీక్షా విధానం, విద్యార్థుల బాధ్యతలు, కళాశాలలో అందుబాటులో ఉన్న విద్యా, సాంస్కృతిక, క్రీడా ఇతర అభివృద్ధి కార్యక్రమాల గురించి అవగాహన కల్పించారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ, కళాశాల అందించే అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని కళాశాల యాజమాన్యం సూచించింది. అలాగే కళాశాలలో నిర్వహించే శిక్షణ, ఉద్యోగ నియామక కార్యక్రమాలు వివిధ కంపెనీల క్యాంపస్ సెలక్షన్లు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉద్యోగ అవకాశాల గురించి వివరించారు. విద్యార్థులు తమ విద్యతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ పరిజ్ఞానం, వృత్తిపరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొని భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలను పొందేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎన్.ఎ.వి.ప్రసాద్, ఏవో.ఎ.శ్రీనాథ్, అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

 మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..