30న లోక్‌సభ, 2న రాజ్యసభ ప్రత్యేక సమావేశాలు..
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక సమావేశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గురువారం కీలక ప్రకటన చేసింది. లోక్‌సభను ఈ నెల 30న (సోమవారం), రాజ్యసభను డిసెంబర్ 2న (బుధవారం) తిరిగి సమావేశపరచాలని లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్‌ను కోరినట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.
అత్యవసర ప్రభుత్వ/శాసనపరమైన వ్యవహారాలను పూర్తి చేసేందుకు ఈ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సభలోని కార్యకలాపాల అవసరాలను బట్టి డిసెంబర్ 3న (గురువారం) రెండు సభల సమావేశాలు ముగిసే అవకాశం ఉందని కిరణ్ రిజిజు పేర్కొన్నారు. కాగా, వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడినప్పటికీ ప్రొరోగ్ చేయకుండా కొనసాగుతున్న నేపథ్యంలో, కీలక బిల్లుల ఆమోదం కోసమే ప్రభుత్వం ఈ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.