గుండ్లసాగరం సర్పంచ్‌గా స్వతంత్ర అభ్యర్థి వత్సలమ్మ వరదరాజులు విజయం
33 ఓట్ల మెజారిటీతో గెలుపు.. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ
గుడిపల్లి మేజర్ న్యూస్: గుడిపల్లి మండలం గుండ్లసాగరం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి వత్సలమ్మ వరదరాజులు కత్తెర గుర్తుపై పోటీ చేసి 33 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.
ఈ సందర్భంగా విజయం సాధించిన వత్సలమ్మ వరదరాజులు మాట్లాడుతూ.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన తనకు గ్రామ ప్రజలు ఆదరించి, నమ్మకంతో సర్పంచ్‌గా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఎల్లప్పుడూ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.
గ్రామ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తానని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేర్చి పంచాయతీ అభివృద్ధికి తోడ్పడతానని హామీ ఇచ్చారు. వత్సలమ్మ వరదరాజులు విజయం సాధించడంతో గుండ్లసాగరం గ్రామంలో విజయోత్సవాలు నిర్వహించుకుని పండుగ వాతావరణం నెలకొంది.
సూర్య రిపోర్టర్ లెనిన్ గుడిపల్లి మండలం