BREAKING
పోలింగ్ ఏజెంట్లు కొరకు పాసులు కమిషనర్ కేవీ కృష్ణారెడ్డి కరటంపాడు లో బ్యాంక్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి ఆత్మకూరులో టౌన్ హాల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి కందుకూరు డివిజన్ విద్యుత్ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కౌన్సిలర్ గోళ కిరణ్ కుమార్ కు ఘన సన్మానం ఆదరించే ప్రజలను మరువబోను మంత్రి డోలా బాలసుబ్రహ్మణ్యంను కలిసిన సర్పంచ్‌లు ఆదరించండి..... జవాబు దారితనంగా పనిచేస్తా. శ్రీకాళహస్తి ప్రాంతం సర్పంచ్లతో ఎమ్మెల్యే బొజ్జల పంచాయతీ ఎన్నికల నిర్వహణపై పరిశీలించిన ఆలయంలో అన్నప్రసాద వితరణ జగనన్న సీఎం కావడం ఖాయం రూ.4,851 కోట్లతో సమగ్ర ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ముందు ప్రతిపాదన : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కంబదూరులో వైసీపీ హవా.. 8 పంచాయతీలు కైవాసం. నాలుగు పంచాయతీలు టిడిపి విజయం. గ్రామ గ్రామాన అభివృద్ధే లక్ష్యం

స్టీల్ ప్లాంట్‌లో ఆక్టోపస్ ‘ఆపరేషన్ థండర్’ ఉత్కంఠ.. ఉగ్రదాడి నివారణపై సమగ్ర మాక్ డ్రిల్

Select Suryaa Now
స్టీల్ ప్లాంట్‌లో ఆక్టోపస్ ‘ఆపరేషన్ థండర్’ ఉత్కంఠ.. ఉగ్రదాడి నివారణపై సమగ్ర మాక్ డ్రిల్

 

గాజువాక, మేజర్ న్యూస్: కోస్టల్ డిఫెన్స్ ఎక్సర్‌సైజ్ ‘సీ విజిలెన్స్–2026’లో భాగంగా విశాఖపట్నంలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ (ఆర్ఐఎన్‌ఎల్) ప్రాంగణంలో గురువారం ఉత్కంఠభరిత వాతావరణంలో ‘ఆపరేషన్ థండర్’ పేరుతో భారీ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ ప్రత్యేక కమాండో విభాగమైన ఆక్టోపస్ ఆధ్వర్యంలో అత్యవసర పరిస్థితుల్లో వివిధ విభాగాలు సమిష్టిగా స్పందించే తీరును ఈ విన్యాసాల ద్వారా పరీక్షించారు.

     ​డ్రిల్ ప్రణాళిక ప్రకారం.. సాయుధులైన ఐదుగురు ఉగ్రవాదులు స్టీల్ ప్లాంట్‌లోని లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ (ఎల్ అండ్ డీసీ) భవనంలోకి చొరబడి, అక్కడున్న సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులు జరిపి పలువురిని బందీలుగా చేసుకున్నారు. ఈ సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన ఆక్టోపస్ కమాండో బృందం వ్యూహాత్మకంగా భవనాన్ని చుట్టుముట్టి ఆపరేషన్ ప్రారంభించింది. మెరుపు వేగంతో లోపలికి ప్రవేశించిన కమాండోలు ఉగ్రవాదులను సమర్థవంతంగా మట్టుబెట్టి బందీలుగా ఉన్నవారిని సురక్షితంగా రక్షించారు.

      ​ఈ మాక్ డ్రిల్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు ముందుగా వివిధ విభాగాల అధికారులతో ప్రత్యేక సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆక్టోపస్ డీఎస్పీలు బి. కృష్ణ, జి. విశ్వనాథ్, ఇన్‌స్పెక్టర్లు ఇ. శ్రీనివాసరావు, ఆర్. రాంబాబు, బి.ఎస్. నరేష్, పి. ఉమాశంకరరావులతో పాటు స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ సీఐ కేశవరావు, ఎస్సై నజీర్ పాల్గొన్నారు. వీరితో పాటు స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులు, డీఎంహెచ్‌ఓ, సీఐఎస్ఎఫ్, అగ్నిమాపక, ట్రాఫిక్, వైద్య, సేఫ్టీ మరియు స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) విభాగాల అధికారులు భాగస్వాములయ్యారు. విశాఖ ఏఆర్ విభాగానికి చెందిన సీఎస్‌డబ్ల్యూ, బాంబ్ డిస్పోజల్ (బీడీ) బృందం, డాగ్ స్క్వాడ్ మరియు ఇతర పోలీసు బలగాలు ఈ విన్యాసాల్లో పాల్గొని తమ వృత్తిపరమైన నైపుణ్యాన్ని, సమన్వయాన్ని చాటుకున్నాయి.

రిపోర్టర్: పీ. కోటిరెడ్డి, గాజువాక ఇంచార్జ్, విశాఖపట్నం