BREAKING
మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు రీ సర్వే ప్రక్రియలో రైతులు భాగస్వాములై అధికారులకు సహకరించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గ్రామాభివృద్ధి నా లక్ష్యం మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-మంత్రి సీతక్క కాళోజీ కళాక్షేత్రంలో కవులు కళాకారుల కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు మూడు నెలలుగా తాగునీటి సరఫరా బంద్-20వ వార్డు ప్రజల అవస్థలు! వికసిత్ భారత్ నిర్మాణంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి-రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మృతుని కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి అంబాల- పరకాల బస్సు ప్రయాణం దుమ్ము ధూళితో నరకం స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమాన్ని పరిశీలించిన పరకాల ఆర్డివో *ఘనంగా ముగిసిన మాదిగల వన సమారాధన* అమెరికా మార్కెట్ల పతనాన్ని అవకాశంగా మార్చుకుంటున్న భారతీయ ఇన్వెస్టర్లు.. ఉద్యోగుల నియామకాలు పెంచకుండానే భారత ఐటీ రంగం వృద్ధి.. ఉద్యోగాలపై నాస్కామ్ కీలక విశ్లేషణ! అధిక ప్యాసింజర్లతో వెళ్లే ఆటోలపై రవాణా శాఖ అధికారుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం

గ్రామ గ్రామాన అభివృద్ధే లక్ష్యం

Select Suryaa Now
గ్రామ గ్రామాన అభివృద్ధే లక్ష్యం

గ్రామ గ్రామాన అభివృద్ధే లక్ష్యం 
– మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
--ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు మంత్రి ఆనం అభినందనలు
--135 గ్రామ పంచాయతీలకు గాను 52 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం
ఆత్మకూరు, మేజర్ న్యూస్ :
రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి  నివాసంలో శుక్రవారం ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామ పంచాయతీలలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు మంత్రి ఆనం ని మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను మంత్రి ఆనం అభినందించారు.
గ్రామ గ్రామాన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు మరింత చేరువ కావాలని సూచించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించే బాధ్యతను స్వీకరించాలని దిశానిర్దేశం చేశారు.
గ్రామీణ ప్రజలకు మరింత చేయూత అందించేందుకు ప్రజాప్రతినిధులుగా లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, గ్రామ సీమల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు.
ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని మొత్తం 135 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటికే 52 గ్రామ పంచాయతీలలో ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని మంత్రి ఆనం పేర్కొన్నారు.
మిగిలిన 83 గ్రామ పంచాయతీలకు ఈ నెల 29వ తేదీ ఆదివారం జరగనున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి ఆనం మాట్లాడుతూ, ప్రతీ పంచాయతీ లో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. 
తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ప్రజల ఆశీస్సులు అందించి భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా నియోజకవర్గ ప్రజలకు మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి విజ్ఞప్తి చేశారు.