25 వేల106 మందికి డిజిటల్ ఎక్స్రేలు- ఆరోగ్య సేవలు... -సూపరిండెంట్ రాథోడ్ జై సింగ్
ప్రభుత్వ సాధారణ ఆస్పత్రి లో ఈ ఏడాది జనవరి నుండి ఇప్పటి వరకు 25వేల 106 మందికి అత్యవసర సాధారణ సేవలలో డిజిటల్ ఎక్స్రేలు నిర్వహించినట్లు మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ రాథోడ్ జైసింగ్ తెలిపారు. డిజిటల్ ఎక్స్రేలు రోగులకు ప్రమాదాలు జరిగినప్పుడు, అత్యవసర సేవలలో శరీరంలోని ఎముకలు విరిగిన వారికి,కీళ్లు చాతి మరియు ఇతర భాగాలను పరీక్షించుటకు ఆధునిక వైద్య సేవ నిమిత్తం తీసినట్లు తెలిపారు. ఆర్థోపెడిక్ విభాగం వారు, ఇతర విభాగాల వైద్యులు ఎక్స్రే సహాయంతో రోగులకు ఎముకలు విరిగిన వారికి, ఇతర రోగులకు చికిత్స చేయుటకు ఎంతో తోడ్పడుతున్నట్టు తెలిపారు. క్షయ వ్యాధి నిర్ధారణ నిమిత్తం, సర్జికల్ సేవలు,ఇతర విభాగాల వారు అవసరమైన ఉన్నత చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వచ్చిన వారికి ఈ సంవత్సరంలో 25,106 డిజిటల్ ఎక్స్రేలు నేటి వరకు పూర్తయినట్లు తెలిపారు.ఈ సందర్భంగా గురువారం నాడు ఎక్స్రే విభాగాన్ని ప్రత్యేకంగా తనిఖీ చేసి సిబ్బందిని ప్రశంసించారు.ఈ ప్రాంతంలోని రోగులకు ఆసుపత్రి లో 24 గంటలు డిజిటల్ ఎక్స్రే సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.కార్యక్రమంలో ఆర్ఎంవోలు డాక్టర్ అజీమ్,డాక్టర్ ప్రశాంత్, డిప్యూటీ నర్సింగ్ సూపర్డెంట్, నర్సింగ్ అధికారులు,ఆసుపత్రి సిబ్బంది, ఎక్స్రే విభాగపు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
-పి.వినయ్ కుమార్,నాగర్ కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్: