అయ్యప్ప మహా పడిపూజలో.. భీమ్ భరత్
చేవెళ్ల: చేవెళ్ల మున్సిపాలిటీలో టాకీస్ దామోదర్ యాదవ్, వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన 18వ శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమానికి చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పామేన భీమ్ భరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.
భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ మహా పడిపూజలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ కార్యక్రమంలో చేవెళ్ళ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ పడాల రాములు, గుండాల రాములు, ఏ బ్లాక్ అధ్యక్షులు ముక్కు రవి కుమార్, రావులపల్లి సర్పంచ్ రాంచంద్రాయ్య, ఈర్లపల్లి నర్సింహా లు, బండారి వెంకటరెడ్డి, మల్గరి మల్లారెడ్డి, రాజు, రావులపల్లి కుమార్, మంగలి కుమార్, బండారి బాల్వంత్ రెడ్డి , బండారి టిల్లు, వినోద్, తదితర నాయకులు పాల్గొన్నారు.