BREAKING
జ్యోతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఎస్.వి. డిగ్రీ, పీజీ కళాశాలలో ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహణ జిల్లా స్థాయి PPT పోటీల్లో ఆరుగురికి రాష్ట్ర స్థాయి అవకాశం గ్రామాల్లో పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలి.. కాటసాని చిన్నారులకు పౌష్టికాహారం, ప్రాథమిక విద్యే లక్ష్యం కేసీఆర్‌పై అభిమానంతో పాదయాత్ర తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి 30న లోక్‌సభ, 2న రాజ్యసభ ప్రత్యేక సమావేశాలు.. రాజ్యాంగ స్ఫూర్తితో ఉత్తమ పౌరులుగా ఎదగాలి స్టీల్ ప్లాంట్‌లో ఆక్టోపస్ ‘ఆపరేషన్ థండర్’ ఉత్కంఠ.. ఉగ్రదాడి నివారణపై సమగ్ర మాక్ డ్రిల్ రైతుల సమక్షంలోనే భూ రీసర్వే చేపట్టాలి : కలెక్టర్ నారాయణ రెడ్డి నిశ్చితార్థ వేడుకలలో పాల్గొన్న డాక్టర్ లక్ష్మీ దంపతులు. ఉచిత కంటి శిబిరంలో 67 మందికి కంటి పరీక్షలు. -జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భరత్ కుమార్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలి: వాసు గుండ్లసాగరం సర్పంచ్‌గా స్వతంత్ర అభ్యర్థి వత్సలమ్మ వరదరాజులు విజయం

తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి

Select Suryaa Now
తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి

సత్తెనపల్లి, మేజర్ న్యూస్ : పట్టణ ప్రజల తాగునీటి అవసరాలకు ఇబ్బంది లేకుండా సాగర్ జలాలను వేగంగా చెరువుకు నింపాలని మున్సిపల్ చైర్మన్ మారెళ్ళ రామాంజనేయులు, తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు దరువూరి నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. గురువారం  మంచినీటి చెరువును త్వరగా నింపడానికి తీసుకుంటున్న చర్యలను వారు ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా చెరువు పరిసర ప్రాంతాలు, నీరు వచ్చే మార్గాలు జరుగుతున్న పనుల పురోగతిని వారు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. చెరువులోకి నీటి సరఫరాలో ఎటువంటి ఆటంకాలు తలెత్తకుండా చూడాలని, పనులను వేగవంతం చేసి చెరువును పూర్తిస్థాయిలో నింపేలా తక్షణ చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులకు వారు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.రాబోయే రోజుల్లో పట్టణవాసులకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేస్తున్నట్లు వారు తెలిపారు.  వారితో పాటు వైస్ చైర్‌పర్సన్ దివ్యవాణి, మున్సిపల్ కమిషనర్ రాంబాబు , డి ఇ ఇ మధుసూధనరావు, ఇంజనీరింగ్, మున్సిపల్ అధికారులు ఉన్నారు.

గన్నవరం ఏలియ