BREAKING
టీడీపీకి ఇంటిపోరు.. వైసీపీకి కలిసొచ్చేనా? రెబల్స్‌ ఎఫెక్ట్‌ ఎవరికి లాభం.. ఎవరికి నష్టం? గుర్తులతో కూడిన కండువాలను బహుకరించిన రాజేష్ జేఎన్‌టీయూఏలో రెండు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు.. బజాజ్ ఆటో ఫౌండేషన్‌తో కీలక ఒప్పందానికి ముందడుగు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి: DMHO డా. కళ్యాణ్ చక్రవర్తి ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం.. నంది సర్కిల్లో అర్ధాంతరంగా ఆగిపోయిన సిసి రోడ్డు పనులు ప్రారంభం.. గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదును వేగవంతం చేయాలి – కలెక్టర్ నారాయణ రెడ్డి రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.. జేఎన్‌టీయూ వీసీ ఆచార్య హెచ్ సుదర్శన్ రావు జ్యోతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఎస్.వి. డిగ్రీ, పీజీ కళాశాలలో ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహణ జిల్లా స్థాయి PPT పోటీల్లో ఆరుగురికి రాష్ట్ర స్థాయి అవకాశం గ్రామాల్లో పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలి.. కాటసాని చిన్నారులకు పౌష్టికాహారం, ప్రాథమిక విద్యే లక్ష్యం కేసీఆర్‌పై అభిమానంతో పాదయాత్ర తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి

జ్యోతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

Select Suryaa Now
జ్యోతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

సత్తెనపల్లి, మేజర్ న్యూస్ :జ్యోతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో పట్టణంలో ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో పలువురు పేదలు, వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించి, కంటి సమస్యలను గుర్తించడం జరిగింది.కంటి సమస్యలు ఉన్నవారికి అవసరమైన కళ్లజోళ్లు ఉచితంగా అందించడంతో పాటు, ఆపరేషన్ అవసరమైన వారికి కూడా ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తామని వైద్య బృందం తెలియజేసింది.ఈ సందర్భంగా జ్యోతి ఫౌండేషన్ అధ్యక్షులు మాట్లాడుతూ.. పేద ప్రజలకు, వృద్ధులకు కంటి సమస్యలపై ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, వారికి అవసరమైన కళ్లజోళ్లు మరియు ఆపరేషన్లు ఉచితంగా అందించేందుకు సహకరిస్తున్న ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రి యాజమాన్యానికి, వైద్య బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పేద ప్రజలకు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. అనంతరం స్థానిక నాయకులు బ్రహ్మారెడ్డి  సహకారంతో ఈ కార్యక్రమానికి విచ్చేసిన వృద్ధులకు, పేదలకు భోజన సదుపాయం కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాస్టర్ బి.ఎస్. రావు గారు, షారోన్ కుమార్, బక్కా శాంతి, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

గన్నవరం ఏలియ