చిన్నారులకు పౌష్టికాహారం, ప్రాథమిక విద్యే లక్ష్యం
రంగారెడ్డి : చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మెరుగైన పౌష్టికాహారం, ప్రాథమిక విద్యను అందించడమే లక్ష్యంగా ఓల్డ్ హఫీజ్‌పేట్‌లోని జనప్రియ నగర్ సాయిరాం కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన మొబైల్ అంగన్‌వాడీ కేంద్రాన్ని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా సంక్షేమ అధికారి శాంతిశ్రీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మాట్లాడుతూ.. ప్రభుత్వ అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయడం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన చిన్నారులకు నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యతో పాటు పౌష్టికాహారం అందించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలను స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి శాంతిశ్రీ,, బాలింగ్ గౌతమ్ గౌడ్, డీసీ శ్రీనివాస్, డీఈ శ్రీదేవి, సీడీపీఓ కవిత, సూపర్‌వైజర్ లోవా కుమారి, సయ్యద్ సాదిక్, స్థానిక ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, కాలనీవాసులు పాల్గొన్నారు.
వి శ్రీనివాస చారి : రంగారెడ్డి మేజర్ న్యూస్