BREAKING
జేఎన్‌టీయూఏలో రెండు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు.. బజాజ్ ఆటో ఫౌండేషన్‌తో కీలక ఒప్పందానికి ముందడుగు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి: DMHO డా. కళ్యాణ్ చక్రవర్తి ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం.. నంది సర్కిల్లో అర్ధాంతరంగా ఆగిపోయిన సిసి రోడ్డు పనులు ప్రారంభం.. గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదును వేగవంతం చేయాలి – కలెక్టర్ నారాయణ రెడ్డి రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.. జేఎన్‌టీయూ వీసీ ఆచార్య హెచ్ సుదర్శన్ రావు జ్యోతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఎస్.వి. డిగ్రీ, పీజీ కళాశాలలో ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహణ జిల్లా స్థాయి PPT పోటీల్లో ఆరుగురికి రాష్ట్ర స్థాయి అవకాశం గ్రామాల్లో పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలి.. కాటసాని చిన్నారులకు పౌష్టికాహారం, ప్రాథమిక విద్యే లక్ష్యం కేసీఆర్‌పై అభిమానంతో పాదయాత్ర తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి 30న లోక్‌సభ, 2న రాజ్యసభ ప్రత్యేక సమావేశాలు.. రాజ్యాంగ స్ఫూర్తితో ఉత్తమ పౌరులుగా ఎదగాలి

జిల్లా స్థాయి PPT పోటీల్లో ఆరుగురికి రాష్ట్ర స్థాయి అవకాశం

Select Suryaa Now
జిల్లా స్థాయి PPT పోటీల్లో ఆరుగురికి రాష్ట్ర స్థాయి అవకాశం

రంగారెడ్డి: వికసిత్ భారత్ – యంగ్ ఇండియా లీడర్ డైలాగ్ – 2026 కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన జిల్లా స్థాయి PPT ఛాలెంజ్ ట్రాక్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. కొత్తపేటలోని అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో గురువారం ఈ పోటీలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ కె. కిరణ్మయి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడంతో పాటు నూతన ఆలోచనలు, ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత చురుకైన భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

జిల్లా స్థాయి PPT ఛాలెంజ్ ట్రాక్ పోటీల్లో పాల్గొనేందుకు మొత్తం 65 మంది అభ్యర్థులు ఎంపిక కాగా, వారిలో ప్రతిభ కనబరిచిన ఆరుగురిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. యువతలో నాయకత్వ లక్షణాలు, సృజనాత్మక ఆలోచనలు, సామాజిక బాధ్యతను పెంపొందించడంతో పాటు దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్. స్వర్ణలత, డిప్యూటీ కలెక్టర్ కె. అనూష, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ కె. సురేష్, డాక్టర్ ఎన్. రాజ్‌కుమార్, మై భారత్ డిప్యూటీ డైరెక్టర్ స్నేహల్, అవినాష్ కాలేజ్ ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.

వి శ్రీనివాస చారి :  రంగారెడ్డి -మేజర్ న్యూస్