BREAKING
ఇద్దరు పిల్లలతో మహిళ అదృశ్యం రాజ్యాంగ రక్షణకు కేఎల్ఆర్‌ కదం! అభ్యర్థులు లేకుండానే హోరాహోరీగా ప్రచారం రంగంలోకి దిగిన కుటుంబ సభ్యులు.. పోటాపోటీగా నాయకుల పర్యటనలు జేఎన్‌టీయూఏలో 9 మందికి ఉద్యోగాలు.. టీడీపీకి ఇంటిపోరు.. వైసీపీకి కలిసొచ్చేనా? రెబల్స్‌ ఎఫెక్ట్‌ ఎవరికి లాభం.. ఎవరికి నష్టం? గుర్తులతో కూడిన కండువాలను బహుకరించిన రాజేష్ జేఎన్‌టీయూఏలో రెండు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు.. బజాజ్ ఆటో ఫౌండేషన్‌తో కీలక ఒప్పందానికి ముందడుగు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి: DMHO డా. కళ్యాణ్ చక్రవర్తి ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం.. నంది సర్కిల్లో అర్ధాంతరంగా ఆగిపోయిన సిసి రోడ్డు పనులు ప్రారంభం.. గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదును వేగవంతం చేయాలి – కలెక్టర్ నారాయణ రెడ్డి రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.. జేఎన్‌టీయూ వీసీ ఆచార్య హెచ్ సుదర్శన్ రావు జ్యోతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఎస్.వి. డిగ్రీ, పీజీ కళాశాలలో ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహణ జిల్లా స్థాయి PPT పోటీల్లో ఆరుగురికి రాష్ట్ర స్థాయి అవకాశం

రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.. జేఎన్‌టీయూ వీసీ ఆచార్య హెచ్ సుదర్శన్ రావు

Select Suryaa Now
రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.. జేఎన్‌టీయూ వీసీ ఆచార్య హెచ్ సుదర్శన్ రావు

అనంతపురం విద్య మేజర్ న్యూస్:-భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, విధులు, రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని జేఎన్‌టీయూ ఉపకులపతి ఆచార్య హెచ్. సుదర్శనరావు పేర్కొన్నారు. గురువారం జేఎన్‌టీయూ అనంతపురం విశ్వవిద్యాలయంలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య హెచ్. సుదర్శనరావు, రిజిస్ట్రార్ ఆచార్య బి. దుర్గా ప్రసాద్, వీసీ ఓఎస్డీ ఆచార్య ఎన్. దేవన్న రాజ్యాంగ ప్రాముఖ్యతను వివరించారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నేతృత్వంలో రూపొందిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగమని, 1949 నవంబర్ 26న ఆమోదం పొందగా, 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిందని తెలిపారు. అనంతరం విశ్వవిద్యాలయ ఉద్యోగులందరితో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు.
కార్యక్రమంలో ఆచార్య వైశాలి గోర్పడే, ఆచార్య పి.ఆర్. భానుమూర్తి, ఆచార్య ఎస్.వి. సత్యనారాయణ, ఆచార్య ఆర్. భవానీ, ఆచార్య సి. శోభాబిందు, ఆచార్య పద్మ సువర్ణ, ఆచార్య ఎస్. వసుంధర, ఆచార్య ఏ.పి. శివకుమార్, ఆచార్య బి. చంద్ర మోహన్ రెడ్డి, డాక్టర్ జి. మమత, పీఆర్వో బి. ఓం ప్రకాష్ తదితర అధ్యాపకులు, బోధనేతర, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

 మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..