ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం..
అనంతపురం విద్య మేజర్ న్యూస్:-జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పి. చెన్నారెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్–2 సమన్వయకర్త డాక్టర్ కె. కళ్యాణి రాధ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాజ్యాంగ ప్రాముఖ్యత, ప్రాథమిక హక్కులు, విధుల గురించి ఉద్యోగులకు వివరించారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. భారత రాజ్యాంగ రూపకల్పనకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందని, ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. అనంతరం ప్రిన్సిపాల్ కళాశాల ఉద్యోగులందరితో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు.
మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..