BREAKING
బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ అంబేద్కర్, పూలే భవనాన్ని నిర్మించాలని నిరసన జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన చప్పిడి జ్ఞానేశ్వర్ కోడుమూరు స్నేహ వృద్ధాశ్రమానికి యూఎస్‌టీ సంస్థ చేయూత వృద్ధులకు నిత్యావసర వస్తువులు, వైద్య సహాయక పరికరాల అందజేత గుండెపోటుతో మృతి చెందిన కుటుంబ సభ్యులకు పరామర్శ.. అలియాస్ రుక్మిణి గుర్తుండిపోయే సినిమా.. నితిన్ క్యారెక్టర్‌పై దీప్తి గంటా ఆసక్తికర వ్యాఖ్యలు ఇంకొల్లు ఉప సర్పంచ్‌గా పాలేరు రామకృష్ణ జనవరి 12 విడుదల మూవీ డబ్బింగ్ షురూ.. సంక్రాంతి బరిలో వెంకటేష్, కల్యాణ్ రామ్ సందడి మిట్స్‌లో ఘనంగా ముగిసిన ఉపాధి నైపుణ్య శిక్షణ కార్యక్రమం : హాజరైన మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ శిక్షకురాలు సంధ్య శ్రీనివాసన్ బోయినపల్లిలో విషాదం: మైనర్ నడిపిన ట్రాక్టర్ కింద పడి బాలుడు మృతి..! జాతీయస్థాయి క్రికెట్ పోటీల్లో మదనపల్లి యువకుల ప్రతిభ : అభినందించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఇంకొల్లు గ్రామ పంచాయితి సర్పంచ్‌గా షేక్‌ మహ్మద్‌ రఫి రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ బాస్కెట్‌బాల్ పోటీలకు రిడ్జ్ విద్యార్థులు ఎంపిక* తిరుపతయ్య పాదయాత్రకు కేసీఆర్ అభినందన ధర్మశాల అడ్వెంచర్ క్యాంప్‌కు కర్నూలు విద్యార్థులు*

అంబేద్కర్‌కు ఘన నివాళులు - శేరిలింగంపల్లి - గోపీనగర్ లో రాజ్యాంగ దినోత్సవం

Select Suryaa Now
అంబేద్కర్‌కు ఘన నివాళులు  - శేరిలింగంపల్లి - గోపీనగర్ లో రాజ్యాంగ దినోత్సవం
హైదరాబాద్ సిటీ బ్యూరో, మేజర్ న్యూస్ (నవంబర్ 26): భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజును పురస్కరించుకుని శేరిలింగంపల్లి గోపీనగర్‌లోని అంబేద్కర్ భవన్‌లో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి అంగరంగ వైభవంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి, సమాజానికి చేసిన అమూల్యమైన సేవలను, భారత రాజ్యాంగం ద్వారా ప్రజలకు కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం వంటి అంశాలను ప్రజలకు వివరించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ రాజ్యాంగబద్ధంగా వినియోగించుకోవాలని, సమాజంలో ప్రతి ఒక్కరూ సమానులేనని పేర్కొన్నారు.
ముఖ్యంగా మహిళలకు ఓటు హక్కుతో పాటు సమాన హక్కులు కల్పించడంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పోషించిన కీలక పాత్రను గుర్తుచేసుకుంటూ ఆయన సేవలను కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని, రాజ్యాంగ విలువలను కాపాడాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జనచైతన్య సంక్షేమ సంఘం సభ్యులు, అంబేద్కర్ భవన్ అధ్యక్షుడు బజార్గట్ రమేష్, గౌరవ అధ్యక్షుడు డాక్టర్ ముసలయ్య, ఉపాధ్యక్షుడు రంగుల ప్రవీణ్, కోశాధికారి సందీప్, ఇ.నరసింహ, రాధిక, ప్రవీణ్ అబ్రహం, జగదీష్, పెంటయ్య, నాంపల్లి రాజు, తుకారాం, పద్మ, గండయ్య, రాములు, అరుణ్ రాజు తదితరులు పాల్గొన్నారు.