BREAKING
అర్జా శ్రీకాంత్ కు టీటీడీ అరుదైన గౌరవం కుల రాజకీయాలు చేయకండి మొలంగూర్ దూద్‌బావి చారిత్రక కట్టడానికి గుర్తింపు తీసుకొస్తాం-- డీపీఓ జగదీష్ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఘన చరిత్ర.. 5 టైటిళ్లు, 158 మ్యాచ్‌లు, 87 విజయాల రికార్డు కోడుమూరు సర్పంచ్ బరిలో ఏడుగురు అభ్యర్థులు! గుర్తుల కేటాయింపుతో ఊపందుకోనున్న ప్రచారం.. ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీ మధ్యేనా? గ్రామపంచాయతీల్లో డీపీఓ ఆకస్మిక తనిఖీలు కోల్ ఇండియా స్థాయి కబడ్డీ పోటీలకు సింగరేణి క్రీడాకారుడు ఎంపిక చిత్రలేఖన పోటీలలో వరదప్ప నాయుడు స్కూల్ విద్యార్థుల అద్భుత ప్రతిభ విద్యుదాఘాతంతో మహిళ మృతి అఖండ వైభవంగా శ్రీ కేదారేశ్వర స్వామి కల్యాణం ​300 మంది మాలధారులకు అన్నప్రసాద వితరణ ​తండోపతండాలుగా తరలివచ్చిన భక్తజనం *పిల్లలకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు ఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి* - కిమ్స్ కడల్స్ కర్నూలు ఆధ్వర్యంలో ప్రత్యేక వర్క్‌షాపులు - సుమారు 80 మంది పీడియాట్రిషియన్లకు ఆధునిక డయాగ్నస్టిక్, చికిత్సా విధానాలపై శిక్షణ ఐపీఎల్ 2027కు ముందే ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ పునరాగమనం కార్మిక హక్కులే అజెండాగా.. -ఏఐసీసీ ఇన్‌చార్జ్‌తో జనక్ ప్రసాద్ కీలక భేటీ 29న దీక్షా దివస్ ను జయప్రదం చేయండి.. కేసీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది: చిందం రమేష్ సింగరేణి సహకారంతో స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్

అలియాస్ రుక్మిణి గుర్తుండిపోయే సినిమా.. నితిన్ క్యారెక్టర్‌పై దీప్తి గంటా ఆసక్తికర వ్యాఖ్యలు

Select Suryaa Now
అలియాస్ రుక్మిణి గుర్తుండిపోయే సినిమా.. నితిన్ క్యారెక్టర్‌పై దీప్తి గంటా ఆసక్తికర వ్యాఖ్యలు

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: నేచురల్ స్టార్ నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన విభిన్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అలియాస్ రుక్మిణి డిసెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమాకు దండోరా ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహించగా, దీప్తి గంటా నిర్మించారు. ఇప్పటికే ట్రైలర్, పాటలతో మంచి బజ్ సొంతం చేసుకున్న ఈ చిత్ర విశేషాలను తాజాగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిర్మాత దీప్తి గంటా పంచుకున్నారు.

కథ చదివినప్పుడే అలియాస్ రుక్మిణి తనకు బాగా నచ్చిందని, దర్శకుడు చెప్పిన నరేషన్‌ను ఎంతో ఎంజాయ్ చేశానని దీప్తి గంటా తెలిపారు. కథ చెబుతున్నంతసేపు ఎక్కడా బోర్ కొట్టలేదని, క్లైమాక్స్ ముగించిన తీరు కూడా హత్తుకునేలా ఉందని చెప్పారు. కథ నచ్చిన తర్వాత నానికి వినిపిస్తామని, ఇద్దరికీ నచ్చితేనే ప్రాజెక్ట్ మొదలుపెడతామని స్పష్టం చేశారు. నితిన్ అయితే ఈ పాత్రకు బాగుంటారని నాని సూచించడంతో కథ వినిపించామని, ఆయనకు నచ్చి వెంటనే ఓకే చేశారని వెల్లడించారు.

కథ ఓకే చేసిన తర్వాత నాని షూటింగ్ ప్రక్రియలో జోక్యం చేసుకోరని, సినిమా పూర్తయ్యాక చూసి తన అభిప్రాయాలు చెబుతారని దీప్తి గంటా పేర్కొన్నారు. ప్రస్తుతం నాని బ్లడీ రోమియో షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ, సమయం కేటాయించి ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారని తెలిపారు. దర్శకుడు మురళీకాంత్ దేవసోత్‌కు స్పష్టమైన విజన్ ఉందని, కమర్షియల్ లెక్కల కంటే నిజాయితీగా కథను తెరకెక్కించారని ప్రశంసించారు.

కథానాయకుడు రుక్మిణి అనే కలం పేరుతో కథలు ఎందుకు రాస్తాడు అనే అంశం సినిమాలో ఆసక్తికరంగా ఉంటుందని, సెన్సార్ బోర్డు జీరో కట్స్‌తో సర్టిఫికెట్ ఇచ్చిందని ఆమె చెప్పారు. సినిమా రన్‌టైమ్ రెండు గంటల 17 నిమిషాలు క్రిస్పీగా ఉంటుందని, నితిన్ పోషించిన కృష్ణ పాత్ర ప్రేక్షకులను కట్టిపడేస్తుందని అన్నారు. సాయికుమార్ పాత్రతో పాటు ప్రతి క్యారెక్టర్ సహజంగా, రిలేటబుల్‌గా ఉంటాయని, హీరోయిన్‌ను ఆడిషన్ ద్వారా ఎంపిక చేశామని తెలిపారు.

విజయ్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ఎమోషనల్ కనెక్ట్‌ను ఇస్తాయని దీప్తి గంటా వివరించారు. డిసెంబర్ 4న మరో సినిమా విడుదలవుతున్నప్పటికీ, వేర్వేరు జానర్స్ కావడంతో ప్రేక్షకులు రెండు చిత్రాలను ఆదరిస్తారనే నమ్మకం ఉందని చెప్పారు. సినిమా చూసిన తర్వాత పాత్రల గురించి మాట్లాడుకునేలా ఈ చిత్రం నిలుస్తుందని, ప్రొడక్షన్ నుంచి బ్రేక్ తీసుకుని భవిష్యత్తులో మళ్లీ దర్శకత్వం వైపు అడుగులు వేస్తానని, తమ బ్యానర్‌లో కోర్ట్ ఫేమ్ జగదీష్‌తో తదుపరి సినిమా ఉండబోతోందని వెల్లడించారు.