BREAKING
ఇంటిముందు విషాదం.. విద్యుత్ షాక్‌తో మహిళ దుర్మరణం రెండో కొత్త బంతితో బుమ్రాలో పదును తగ్గింది.. సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు భూ రీ సర్వే కు రైతులు సహకరించాలి… ఆర్ఈసిఎస్ లో అక్రమాలు నిజమే మెదక్ జిల్లా మండల పంచాయతీ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక… లక్కోరా గ్రామంలో బాల్య వివాహ ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమం  పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదు : జిల్లా కలెక్టర్ శ్రీ.పి. రాజాబాబు మోడల్ స్కూల్ విద్యార్థులకు ఐడి కార్డుల పంపిణీ హెచ్ఐవి-ఎయిడ్స్ పై అవగాహన... మార్కెట్ కమిటీ అభివృద్ధికి పాలకవర్గ సభ్యులతో కలిసి కృషి చేస్తా.… 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026 పిల్లలపై లైంగిక వేధింపుల నివారణకు అవగాహన అవసరం ఒంగోలులో యువ సంవాద్ – వికసిత్ భారత్ కార్యక్రమం మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి క్రైస్ట్‌చర్చ్ టెస్టు తొలి రోజు ఆటలో న్యూజిలాండ్ పైచేయి.. 246/5తో నిలిచిన ఆతిథ్య జట్టు.

కోడుమూరు సర్పంచ్ బరిలో ఏడుగురు అభ్యర్థులు! గుర్తుల కేటాయింపుతో ఊపందుకోనున్న ప్రచారం.. ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీ మధ్యేనా?

Select Suryaa Now
కోడుమూరు సర్పంచ్ బరిలో ఏడుగురు అభ్యర్థులు!  గుర్తుల కేటాయింపుతో ఊపందుకోనున్న ప్రచారం.. ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీ మధ్యేనా?

కోడుమూరు మేజర్ న్యూస్ :కోడుమూరు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో ఏడుగురు అభ్యర్థులు నిలిచారు. ఈ మేరకు శుక్రవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్‌ఓ) పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేయడంతో పాటు వారికి ఎన్నికల గుర్తులను కేటాయించారు.

అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు ఇవే..

1. కేఈ మల్లికార్జున గౌడ్ – మంచం గుర్తు (టీడీపీ బలపరిచిన అభ్యర్థి)
2. గుజరాతి ప్రవీణ్ కుమార్ – కత్తెర గుర్తు (వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థి)
3. సీబీ లత – ఉంగరం గుర్తు (టీడీపీ అభ్యర్థి)
4. సీబీ కృష్ణవేణి – బుట్ట గుర్తు
5. బోయ మస్తాన్ – సాసర్ గుర్తు
6. బోయ బలరాం – వంకాయ గుర్తు
7. వై. సోమశేఖర్ యాదవ్ – క్యారెట్ గుర్తు

కోడుమూరు మేజర్ పంచాయతీ చరిత్రలో తొలిసారిగా ఏడుగురు అభ్యర్థులు సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థి గుజరాతి ప్రవీణ్ కుమార్,టీడీపీ బలపరిచిన అభ్యర్థి కేఈ మల్లికార్జున గౌడ్,టీడీపీ  అభ్యర్థిగా బరిలో ఉన్న సీబీ లత మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు

20 వార్డుల్లోనూ హోరాహోరీ ప్రచారం!

కోడుమూరు మేజర్ పంచాయతీలోని 20 వార్డులకు 65 మందికి పైగా అభ్యర్థులు పోటీలో ఉండటంతో ఎన్నికల సందడి నెలకొంది. ప్రతి వార్డులోనూ ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉండటంతో వీధివీధినా ప్రచార హోరు కనిపిస్తోంది. ఇంటింటి ప్రచారాలు, ఓటర్లను కలుసుకోవడం, మద్దతు కూడగట్టుకోవడంలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు.

ఎన్నికల గుర్తులు కేటాయింపు పూర్తవడంతో అభ్యర్థులు తమ గుర్తులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రచారాన్ని మరింత ఉధృతం చేయనున్నారు. ఏడుగురు అభ్యర్థుల్లో పట్టణ ప్రజలు ఎవరికి పట్టం కడతారు? ప్రధాన పోటీలో ఎవరు పైచేయి సాధిస్తారు? రెబల్ అభ్యర్థి ఓట్లపై ఎలాంటి ప్రభావం చూపనున్నారు? అన్న అంశాలు కోడుమూరు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.