మెదక్ జిల్లా మండల పంచాయతీ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక…
నర్సాపూర్;మెదక్ జిల్లా మండల పంచాయతీ అధికారుల సంఘం నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం మెదక్ జిల్లా పంచాయతీ కార్యాలయంలో జిల్లా పంచాయతీ అధికారి, తూప్రాన్ మెదక్, నర్సాపూర్ డివిజనల్ పంచాయతీ అధికారుల సమక్షంలో సంఘం సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేసి వివిధ బాధ్యతలను అప్పగించారు. గౌరవ అధ్యక్షులుగా ఏ. ప్రకాష్, అధ్యక్షులుగా ఎం. తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా నర్సాపూర్ మండల పంచాయతీ అధికారి మొహమ్మద్ మొఅజ్జం హుస్సేన్ ఎంపికయ్యారు.ఉపాధ్యక్షులు- వి. శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులు- ఏ. శ్రీశైలం, కార్యదర్శిగా జి. ప్రశాంత్, కోశాధికారిగా ఎం. రాజనీకాంత్ రెడ్డి, ప్రచార కార్యదర్శిగా ఎన్. సతీష్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా మునీర్ ఉద్దీన్ ఎన్నికయ్యారు.ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా హల్దీగనపూర్‌కు చెందిన సయ్యద్ మగ్దూం అహ్మద్, టేక్‌మాల్‌కు చెందిన రియాజుద్దీన్, నార్సింగికి చెందిన షేక్ సయీద్, రేగోడ్‌కు చెందిన ఏ. గంగాధర్, శంకరంపేట (ఆర్)కు చెందిన వినోద్, మెదక్‌కు చెందిన పి. హనుమంతరావు, కౌడిపల్లికి చెందిన రామారావు, శంకరంపేట (ఏ)కు చెందిన క్రాంతి కుమార్, రామాయంపేటకు చెందిన రాజేందర్ ఎంపికయ్యారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ సంఘం అభివృద్ధి, ఐక్యతతో పాటు సభ్యుల సంక్షేమానికి సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు. తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.