BREAKING
పోలింగ్ ఏజెంట్లు కొరకు పాసులు కమిషనర్ కేవీ కృష్ణారెడ్డి కరటంపాడు లో బ్యాంక్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి ఆత్మకూరులో టౌన్ హాల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి కందుకూరు డివిజన్ విద్యుత్ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కౌన్సిలర్ గోళ కిరణ్ కుమార్ కు ఘన సన్మానం ఆదరించే ప్రజలను మరువబోను మంత్రి డోలా బాలసుబ్రహ్మణ్యంను కలిసిన సర్పంచ్‌లు ఆదరించండి..... జవాబు దారితనంగా పనిచేస్తా. శ్రీకాళహస్తి ప్రాంతం సర్పంచ్లతో ఎమ్మెల్యే బొజ్జల పంచాయతీ ఎన్నికల నిర్వహణపై పరిశీలించిన ఆలయంలో అన్నప్రసాద వితరణ జగనన్న సీఎం కావడం ఖాయం రూ.4,851 కోట్లతో సమగ్ర ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ముందు ప్రతిపాదన : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కంబదూరులో వైసీపీ హవా.. 8 పంచాయతీలు కైవాసం. నాలుగు పంచాయతీలు టిడిపి విజయం. గ్రామ గ్రామాన అభివృద్ధే లక్ష్యం

మూసాపేట, కోకాపేట నియోపొలిస్ భూములకు దాఖలు కాని బిడ్లు..ఉదయం, మధ్యాహ్నం విడతల్లో నిర్వహించిన ఈ–వేలం రద్దు

Select Suryaa Now
మూసాపేట, కోకాపేట నియోపొలిస్ భూములకు దాఖలు కాని బిడ్లు..ఉదయం, మధ్యాహ్నం విడతల్లో నిర్వహించిన ఈ–వేలం రద్దు

హైదరాబాద్, సూర్య ప్రతినిధి: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) శుక్రవారం నిర్వహించిన ప్రతిష్ఠాత్మక భూముల ఈ–వేలానికి పెట్టుబడిదారుల నుంచి స్పందన కరువైంది. మూసాపేట ట్రక్ పార్క్‌లోని 3.15 ఎకరాలు, కోకాపేట నియోపొలిస్ లేఅవుట్‌లోని 4.59 ఎకరాల భూముల విక్రయానికి ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా ఈ–వేలం నిర్వహించినప్పటికీ ఒక్క బిడ్ కూడా దాఖలు కాలేదు. దీంతో అధికారులు వేలాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

భారీ ధరలు, వివాదాల ఎఫెక్ట్:

గతంలో హాట్ కేకుల్లా అమ్ముడైన ఈ ప్రాంతాల్లో ఈసారి కనీస ధరలను భారీగా నిర్ణయించడం రియల్ ఎస్టేట్ వర్గాలను వెనక్కి తగ్గేలా చేసినట్లు తెలుస్తోంది. మూసాపేట భూములకు ఎకరా కనీస ధర (అప్‌సెట్ ప్రైస్) రూ.99 కోట్లుగా నిర్ణయించగా, కోకాపేట నియోపొలిస్ భూములకు ఎకరా కనీస ధర ఏకంగా రూ.120 కోట్లుగా ఫిక్స్ చేశారు. దీనికి తోడు మూసాపేట ట్రక్ పార్క్ భూముల విక్రయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపట్టడం కూడా ఇన్వెస్టర్ల అనాసక్తికి కారణమైంది. కాగా, ఇటీవల జూబ్లీహిల్స్‌లోని హుడా హైట్స్ ఈ–వేలాన్ని కూడా హెచ్ఎండీఏ వాయిదా వేయగా, రెండు రోజుల క్రితం బంజారాహిల్స్‌లోని హుడా పార్క్ లేఅవుట్ ప్లాట్ల వేలానికి సైతం ఒక్క బిడ్ కూడా రాలేదు.