అత్యాచారం, బ్లాక్‌మెయిల్ కేసులో జిమ్ కోచ్‌కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
హైదరాబాద్, సూర్య ప్రతినిధి: అత్యాచారం, బ్లాక్‌మెయిల్ కేసులో ఓ జిమ్ కోచ్‌కు ఎల్బీనగర్ కోర్టు కఠిన శిక్ష విధించింది. నిందితుడు మహ్మద్ మౌజం అలీకి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.8 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది.
బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా, ఆ దృశ్యాలతో బ్లాక్‌మెయిల్ చేసినట్లు విచారణలో నేరం రుజువు కావడంతో న్యాయస్థానం ఈ మేరకు కఠిన నిర్ణయం తీసుకుంది. మహిళలపై నేరాలకు పాల్పడే వారికి ఈ తీర్పు ఒక గట్టి హెచ్చరికగా నిలుస్తుందని న్యాయ, పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.