BREAKING
ఆత్మకూరులో టౌన్ హాల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి కందుకూరు విద్యుత్ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కౌన్సిలర్ గోళ కిరణ్ కుమార్ కు ఘన సన్మానం ఆదరించే ప్రజలను మరువబోను మంత్రి డోలా బాలసుబ్రహ్మణ్యంను కలిసిన సర్పంచ్‌లు ఆదరించండి..... జవాబు దారితనంగా పనిచేస్తా. శ్రీకాళహస్తి ప్రాంతం సర్పంచ్లతో ఎమ్మెల్యే బొజ్జల పంచాయతీ ఎన్నికల నిర్వహణపై పరిశీలించిన ఆలయంలో అన్నప్రసాద వితరణ జగనన్న సీఎం కావడం ఖాయం రూ.4,851 కోట్లతో సమగ్ర ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ముందు ప్రతిపాదన : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కంబదూరులో వైసీపీ హవా.. 8 పంచాయతీలు కైవాసం. నాలుగు పంచాయతీలు టిడిపి విజయం. గ్రామ గ్రామాన అభివృద్ధే లక్ష్యం కరటంపాడు లో హోరెత్తిన సర్పంచ్ అభ్యర్థి ప్రచారం JC అగ్రహారం పంచాయతీ కూటమి సర్పంచ్ అభ్యర్థి దప్పిలి వీరా రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

తెలంగాణలో బీజేపీ బలోపేతమే లక్ష్యం : బీజేపీ సీనియర్​ నేత పెరిక సురేష్​

Select Suryaa Now
తెలంగాణలో బీజేపీ బలోపేతమే లక్ష్యం  : బీజేపీ సీనియర్​ నేత పెరిక సురేష్​
 
 
సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధి :
 తెలంగాణలో 2028 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ కార్యాచరణకు సిద్ధమవుతోందని ఆపార్టీ సీనియర్​ నేత పెరిక సురేష్​ వెల్లడించారు. రాష్ట్రంలోని ఐదు ఉమ్మడి జిల్లాల్లో భారీ స్థాయిలో మహా పాదయాత్రలు నిర్వహించాలని ప్రతిపాదించినట్లు చెప్పారు.  శుక్రవారంఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌ను న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కలిసి చర్చించినట్లు పార్టీ నేత సురేష్​ వెల్లడించారు.
ఇటీవల కరీంనగర్‌లో లక్ష మంది కార్యకర్తలతో నిర్వహించిన మహా పాదయాత్ర, హైదరాబాద్​లో నిర్వమించిన నషా ముక్త్​​ భారత్​ పాదయాత్రలు విజయవంతమైన నేపథ్యంలో.. అదే తరహాలో రాష్ట్రంలో మరో ఐదు ఉమ్మడి జిల్లాల్లో భారీ పాదయాత్రలు చేపట్టాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఒక్కో జిల్లాలో లక్ష మంది కార్యకర్తలతో పాదయాత్ర నిర్వహించాలని ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు.
మొత్తం ఐదు జిల్లాల్లో ఐదు లక్షల మంది కార్యకర్తలను సమీకరించి పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వివరించారు. 2028లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఈ కార్యాచరణకు రూపకల్పన చేస్తున్నట్లు సురేష్ వెల్లడించారు.
ఏ. రవీందర్, హైదరాబాద్.