ఉచిత పశు వైద్య శిబిరంతో రైతులకు ప్రయోజనం
రామాయంపేట;రామాయంపేట మండల పరిధిలోని ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో గురువారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మానే గాల రామకృష్ణయ్య, పశువైద్య అధికారి శ్రీనివాస్ ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలోని సుమారు 70 పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులతో పాటు మినరల్ మిక్సర్‌ను ఉచితంగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పశువుల ఆరోగ్య సంరక్షణ, వ్యాధుల నివారణ, సకాలంలో టీకాలు వేయించడం, నట్టల నివారణ వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. పశువులకు అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పశువైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మహేష్, రైతు ప్రభాకర్‌తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.