BREAKING
ఆత్మకూరులో టౌన్ హాల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి కందుకూరు డివిజన్ విద్యుత్ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కౌన్సిలర్ గోళ కిరణ్ కుమార్ కు ఘన సన్మానం ఆదరించే ప్రజలను మరువబోను మంత్రి డోలా బాలసుబ్రహ్మణ్యంను కలిసిన సర్పంచ్‌లు ఆదరించండి..... జవాబు దారితనంగా పనిచేస్తా. శ్రీకాళహస్తి ప్రాంతం సర్పంచ్లతో ఎమ్మెల్యే బొజ్జల పంచాయతీ ఎన్నికల నిర్వహణపై పరిశీలించిన ఆలయంలో అన్నప్రసాద వితరణ జగనన్న సీఎం కావడం ఖాయం రూ.4,851 కోట్లతో సమగ్ర ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ముందు ప్రతిపాదన : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కంబదూరులో వైసీపీ హవా.. 8 పంచాయతీలు కైవాసం. నాలుగు పంచాయతీలు టిడిపి విజయం. గ్రామ గ్రామాన అభివృద్ధే లక్ష్యం కరటంపాడు లో హోరెత్తిన సర్పంచ్ అభ్యర్థి ప్రచారం JC అగ్రహారం పంచాయతీ కూటమి సర్పంచ్ అభ్యర్థి దప్పిలి వీరా రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

ప్రభుత్వ ఆస్తులకు బీజేపీ రంగులా?వాటర్ ట్యాంకర్ వ్యక్తిగత అవసరాలకు వినియోగం?

Select Suryaa Now
ప్రభుత్వ ఆస్తులకు బీజేపీ రంగులా?వాటర్ ట్యాంకర్ వ్యక్తిగత అవసరాలకు వినియోగం?

కొల్చారం;కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి గ్రామంలో ప్రభుత్వ ఆస్తులకు రాజకీయ పార్టీ రంగులు వేయించడంతో పాటు, ప్రజా అవసరాల కోసం వినియోగించాల్సిన గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకర్‌ను వ్యక్తిగత అవసరాలకు ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి ఈ అంశాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పుల్లబోయిన దుర్గేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) యాదయ్యను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేశారు.గ్రామ సర్పంచ్ పాతూరి దయాకర్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ భవనంతో పాటు పంచాయతీకి చెందిన వాటర్ ట్యాంకర్‌కు బీజేపీ పార్టీ రంగులు వేయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులు ఏ రాజకీయ పార్టీకి సంబంధించినవి కావని, అవి ప్రజలందరికీ చెందుతాయని దుర్గేశ్ స్పష్టం చేశారు.అలాగే ప్రజల అవసరాల కోసం వినియోగించాల్సిన వాటర్ ట్యాంకర్‌ను వ్యక్తిగత అవసరాలకు ఉపయోగిస్తున్నారనే ఆరోపణలపై అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని కోరారు. ఆరోపణలు నిజమని తేలితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీపీఓను విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ చిట్యాల రవికుమార్, కాంగ్రెస్ నాయకులు గడ్డమిది బ్రహ్మం, సాయిని పోనేష్, గడ్డమిది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.