తూప్రాన్ లో ఎక్కడికక్కడే పేరుకుపోయిన చెత్తా చెదరం
తూప్రాన్;తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని హైదర్ గూడ బ్రిడ్జి సర్వీస్ రోడ్లో చెత్తాచెదారం ఎక్కడికక్కడే పేరుకొని పోయింది. దీంతో రోడ్ అంతా దుర్గంధంగా మారింది. చాలా రోజులుగా ఎక్కడి చెత్త అక్కడే ఉన్నాగాని, అధికారులు గానీ ప్రజాప్రతినిధులు గాని పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డుకి ఇరువైపులా పేరుకుపోయిన చెత్తాచెదారన్ని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.