BREAKING
వసంత నాగేశ్వరరావు సతీమణి హైమావతి మృతి పట్ల మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంతాపం భక్త కనకదాసు జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన ప్రకాశం జిల్లా పోలీసులు నాగినేనిగుంటలో 'ఈటె' ప్రచారం టిడిపిలో చేరిన వైసీపీ నాయకులు ఎక్సైజ్ అధికారుల దాడులు, ఒకరు అరెస్ట్ అత్యాచారం, బ్లాక్‌మెయిల్ కేసులో జిమ్ కోచ్‌కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష వింజమూరు మండల పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ హవా ఆత్మకూరులో తొమ్మిది పంచాయతీల సర్పంచులు ఏకగ్రీవం మల్లిఖార్జునపురం పంచాయతీ ఏకగ్రీవం...! కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీచేసిన స్పెషలాఫీసర్ ఎంపీడీవో శ్రీనివాస్ మా జట్టులో ఆడతావా.. రిషభ్ పంత్‌కు న్యూజిలాండ్ క్లబ్ క్రికెట్ టీమ్ ఆఫర్ తల్లి సర్పంచ్‌గా విజయం సాధించడంతో మాలకొండకు కుమారుడి పాదయాత్ర..! మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు గారిని కలిసిన వంగపాడు సర్పంచ్ పంచాయతీ ఎన్నికల్లో వింజమూరు లో హవా కొనసాగించిన వైసిపి కనుమర్లపూడి వారి వివాహ రిసెప్షన్ మహోత్సవంలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా రాంబాబు

ఎల్ ని నొ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి.

Select Suryaa Now
ఎల్ ని నొ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి.

కొల్చారం;ఎల్ నినో ప్రభావం దృష్టిలో పెట్టుకుని మెదక్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వరి పంట కాకుండా ఆరుతడి పంటలను ప్రత్యామ్నాయంగా తీసుకొని ప్రత్యేక గ్రామసభలు ఏర్పాటు చేయాలని సర్పంచులకు, అధికారులకు ఆదేశాలిచ్చారు. కొల్చారం మండలంలోని మండల కేంద్రమైన కొల్చారం గ్రామ సర్పంచ్ దేవన్న గారి శేఖర్ , నాయిని జలాల్పూర్ సర్పంచ్ దేవి సింగ్ ఆధ్వర్యంలో జరిగిన గ్రామసభలు మండల అధికారుల పర్యవేక్షణలో గ్రామ ప్రజల మధ్య గ్రామసభ నిర్వహించడం జరిగింది.ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, భూగర్భ జలాల తగ్గుదల, సాగునీటి కొరతను దృష్టిలో ఉంచుకుని రైతులు వ్యవసాయంలో పంటల వైవిధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని, వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించాలని మండల ఏఈఓ గౌతమి సూచించారు. ఎల్‌నినో ప్రభావం, వ్యవసాయంపై దాని ప్రభావం, ప్రత్యామ్నాయ పంటల సాగుపై శుక్రవారం గ్రామసభ జరిగింది.ఈ సందర్భంగా మండల ఏ ఈ ఓ గౌతమి, ఏపీఓ మైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు లు తక్కువ నీటితో సాగు చేసుకునే పొద్దుతిరుగుడు, కంది, శనగ, పెసర, మినుము, జొన్న తదితర ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు. ఒకే పంటపై ఆధారపడకుండా పంటల మార్పిడి విధానాన్ని అనుసరించడం ద్వారా సాగు ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.యాసంగి సీజన్‌లో  పెసర, మినుము, శనగ, కంది, జొన్న, మరియు ఇతర ఆరుతడి పంటలు తక్కువ కాలంలో చేతికి వస్తాయని, పంటల మార్పిడిలో వీటికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పొద్దుతిరుగుడు, కంది వంటి పంటలను కూడా సాగునీటి లభ్యత, నేల స్వభావాన్ని బట్టి ఎంపిక చేసుకోవాలని తెలిపారు.రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటిస్తూ తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని ఆమె కోరారు. పంటల వైవిధ్యంతో వాతావరణ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రఫిక్ ఉన్నిసా బేగం,ఏపీఓ మైపాల్ రెడ్డి, జిపిఓలు, విద్యుత్ ఏ.ఇ. మహమూద్ అలీ,పశువైద్యాధికారి వీరేశం, పంచాయతీ కార్యదర్శిలు ప్రశాంత్ మౌనిక, ఉపసర్పంచ్లు నాయిని వెంకట నరసింహులు, రాణి గోపి,ఆశ వర్కర్లు, అంగన్వాడి టీచర్లు ,  ఫీల్డ్ అసిస్టెంట్ నాయిని సత్యనారాయణ, వివో ఏ సమంత,మండల అధికారులు, వార్డు సభ్యులు గంగ స్వామి, దుర్గయ్య, ప్రసాద్, సంతోషిని, అనసూయ, ప్రజాప్రతినిధు లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు