BREAKING
ఆత్మకూరులో టౌన్ హాల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి కందుకూరు విద్యుత్ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కౌన్సిలర్ గోళ కిరణ్ కుమార్ కు ఘన సన్మానం ఆదరించే ప్రజలను మరువబోను మంత్రి డోలా బాలసుబ్రహ్మణ్యంను కలిసిన సర్పంచ్‌లు ఆదరించండి..... జవాబు దారితనంగా పనిచేస్తా. శ్రీకాళహస్తి ప్రాంతం సర్పంచ్లతో ఎమ్మెల్యే బొజ్జల పంచాయతీ ఎన్నికల నిర్వహణపై పరిశీలించిన ఆలయంలో అన్నప్రసాద వితరణ జగనన్న సీఎం కావడం ఖాయం రూ.4,851 కోట్లతో సమగ్ర ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ముందు ప్రతిపాదన : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కంబదూరులో వైసీపీ హవా.. 8 పంచాయతీలు కైవాసం. నాలుగు పంచాయతీలు టిడిపి విజయం. గ్రామ గ్రామాన అభివృద్ధే లక్ష్యం కరటంపాడు లో హోరెత్తిన సర్పంచ్ అభ్యర్థి ప్రచారం JC అగ్రహారం పంచాయతీ కూటమి సర్పంచ్ అభ్యర్థి దప్పిలి వీరా రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

ఎక్సైజ్ అధికారుల దాడులు, ఒకరు అరెస్ట్

Select Suryaa Now
ఎక్సైజ్ అధికారుల దాడులు, ఒకరు అరెస్ట్

ఎక్సైజ్ అధికారుల దాడులు, ఒకరు అరెస్ట్ 
ఆత్మకూరు, మేజర్ న్యూస్ :
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆత్మకూరు ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మద్యం అక్రమ విక్రయాలు, నిల్వలు, రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ నిర్వహించారు.ఇందులో భాగముగా ఈరోజు శుక్రవారం ఆత్మకూరు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఆత్మకూరు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ యం.వి.కృష్ణా రావు తన యొక్క సిబ్బందితో మరియు అసిస్టెంట్ కమీషనర్ ఎన్ఫోర్స్మెంట్
వారి సిబ్బందితో కలిసి ఆత్మకూరు మండలంలోని బోటికర్లపాడు గ్రామంలో అక్రమంగా (10) మద్యం బాటిల్స్ విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆత్మకూరు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ యం.వి.కృష్ణా రావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం పంపిణీ చేయడం, అక్రమంగా మద్యం నిల్వ చేయడం, విక్రయించడం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా ప్రత్యేక తనిఖీలు, దాడులు కొనసాగుతాయని తెలిపారు.ఎవరూ అక్రమంగా మద్యం నిల్వలు, పంపిణీలు చేయరాదని ఆత్మకూరు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్
ఎం. వి. కృష్ణారావు సూచించారు.