నాగినేనిగుంటలో 'ఈటె' ప్రచారం
నాగినేనిగుంటలో 'ఈటె' ప్రచారం
మర్రిపాడు మేజర్ న్యూస్: మర్రిపాడు మండలంలోని నాగినేని గుంట పంచాయితీలో తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఈటె వెంకటయ్య శుక్రవారం ముమ్మర ప్రచారం సాగించారు. ఈ నేపథ్యంలో పంచాయితీ పరిధిలో ఉన్నటువంటి బాట, ఏనేపల్లి, మిట్టపాలెం, నాగినేనిగుంట గ్రామాల్లో చివరి రోజున ఓటర్లను కలిసి తనకు ఓటు వేయాలంటూ అభ్యర్థించారు. ఈ సందర్భంగా కరపత్రాలను పంచుతూ పంచాయితీ అభివృద్ధికి తోడ్పడతానని హామీ ఇచ్చారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆశీస్సులతో ఎన్నికల బరిలో నిలబడ్డానని ఓటర్లకు వివరించారు. తనను గెలిపిస్తే మంత్రి ఆనం ఆశీస్సులతో పంచాయితీ అభివృద్ధి చెందుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఈటె శ్రీనివాసులు, బిజివేముల రవిరెడ్డి, కంటా తిమ్మయ్య, కంచర్ల నరసింహారెడ్డి తదితర టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.