ఇంటిముందు విషాదం.. విద్యుత్ షాక్‌తో మహిళ దుర్మరణం
గుర్రంపోడ్ మండల పరిధిలోని సుల్తాన్‌పురం గ్రామంలో గురువారం సాయంత్రం విద్యుదాఘాతానికి గురై ఓ మహిళ మృతి చెందింది.వివరాల్లోకి వెళితే.. సుల్తాన్‌పురం గ్రామానికి చెందిన ఏలుకొండ వెంకటమ్మ (48), భర్త ఈదయ్య, వృత్తి వ్యవసాయం. గురువారం సాయంత్రం సుమారు 6:00 గంటల సమయంలో ఆమె తన ఇంటి ముందున్న ఇనుప తీగపై బట్టలు ఆరేస్తుండగా, ప్రమాదవశాత్తు ఆ తీగను తాకడంతో కరెంట్ షాక్ తగిలింది. దీంతో స్పృహ తప్పి కింద పడిపోయిన ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ఈ ఘటనపై మృతురాలి భర్త ఏలుకొండ ఈదయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.