భూ రీ సర్వే కు రైతులు సహకరించాలి…
నర్సాపూర్;రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూముల రీ సర్వేకు రైతులు సహకరించాలని ఏడి ఏ కిషన్ కోరారు శుక్రవారం నర్సాపూర్ మండలంలోని చిన్నచింతకుంట గ్రామంలో నిర్వహిస్తున్న భూ రీ సర్వే ను పనులను పరిశీలించారు ఈ సందర్భంగా ఏడి కిషన్ మాట్లాడుతూ అధికారులు తమ గ్రామానికి అధికారులు భూ రీ సర్వేకు వచ్చినప్పుడు రైతులు తమ భూమి హద్దులను చూపించి రీ సర్వే చేయించుకోవాలని ఆయన రైతులకు సూచించారు. అదేవిధంగా భూ రీ సర్వే చేసుకోవడం వల్ల భూ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని ఆయన రైతులకు గుర్తు చేశారు. ఈ సర్వేలో ఆయనతోపాటు మండల సర్వేయర్ అభిలాష్ జిపిఓ భూలక్ష్మి టిఆర్ఎస్ నాయకులు మురళి గౌడ్ రైతులు శ్రీనివాస్ గౌడ్ సత్యనారాయణ బాలరాజ్ వీరస్వామి తదితరులు ఉన్నారు.