BREAKING
కరటంపాడు లో బ్యాంక్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి ఆత్మకూరులో టౌన్ హాల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి కందుకూరు డివిజన్ విద్యుత్ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కౌన్సిలర్ గోళ కిరణ్ కుమార్ కు ఘన సన్మానం ఆదరించే ప్రజలను మరువబోను మంత్రి డోలా బాలసుబ్రహ్మణ్యంను కలిసిన సర్పంచ్‌లు ఆదరించండి..... జవాబు దారితనంగా పనిచేస్తా. శ్రీకాళహస్తి ప్రాంతం సర్పంచ్లతో ఎమ్మెల్యే బొజ్జల పంచాయతీ ఎన్నికల నిర్వహణపై పరిశీలించిన ఆలయంలో అన్నప్రసాద వితరణ జగనన్న సీఎం కావడం ఖాయం రూ.4,851 కోట్లతో సమగ్ర ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ముందు ప్రతిపాదన : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కంబదూరులో వైసీపీ హవా.. 8 పంచాయతీలు కైవాసం. నాలుగు పంచాయతీలు టిడిపి విజయం. గ్రామ గ్రామాన అభివృద్ధే లక్ష్యం కరటంపాడు లో హోరెత్తిన సర్పంచ్ అభ్యర్థి ప్రచారం

తల్లి సర్పంచ్‌గా విజయం సాధించడంతో మాలకొండకు కుమారుడి పాదయాత్ర..!

Select Suryaa Now
తల్లి సర్పంచ్‌గా విజయం సాధించడంతో మాలకొండకు కుమారుడి పాదయాత్ర..!

తల్లి సర్పంచ్‌గా విజయం సాధించడంతో మాలకొండకు కుమారుడి పాదయాత్ర..!

ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సహకారంతో...

జమ్మలపాలెం పంచాయతీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తాం..

జమ్మలపాలెం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన..

టిడిపి నేత సింగమనేని మనోజ్ యాదవ్..


జలదంకి, మేజర్ న్యూస్ :-

జమ్మలపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా తన తల్లి సింగమనేని కోటమ్మ విజయం సాధించడంతో కుమారుడు, జమ్మలపాలెం టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు సింగమనేని మనోజ్ మాలకొండకు పాదయాత్ర చేపట్టారు. తల్లి విజయంతో మొక్కు తీర్చుకునేందుకు ఆయన చేపట్టిన పాదయాత్ర స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.జమ్మలపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన సింగమనేని కోటమ్మను గెలిపించాలని ఎన్నికల ప్రచార సమయంలో మనోజ్ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లారు. “మా అమ్మకు ఒక్క అవకాశం ఇవ్వండి.. ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించండి” అంటూ ఇంటింటికీ తిరిగి ప్రజలను అభ్యర్థించారు.తన తల్లి విజయం సాధించడంతో ఆనందం వ్యక్తం చేసిన మనోజ్, మాలకొండకు పాదయాత్రగా వెళ్లి స్వామివారిని దర్శించేందుకు పాదయాత్ర చేపట్టారు.. తల్లి గెలుపునకు సహకరించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడమే తమ ముందున్న లక్ష్యమని మనోజ్ పేర్కొన్నారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సహకారంతో జమ్మలపాలెం పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు.తల్లి విజయం కోసం ఎన్నికల ప్రచారంలో అలుపెరగని కృషి చేసిన మనోజ్, విజయం అనంతరం మాలకొండకు పాదయాత్ర చేపట్టడం గ్రామ ప్రజలను ఆకట్టుకుంది..