ఆత్మకూరులో తొమ్మిది పంచాయతీల సర్పంచులు ఏకగ్రీవం
ఆత్మకూరులో తొమ్మిది పంచాయతీల సర్పంచులు ఏకగ్రీవం
--12పంచాయతీల్లో పోటీలు
--బరిలో 28మంది అభ్యర్థులు
ఆత్మకూరు, మేజర్ న్యూస్: ఆత్మకూరు మండలంలో తొమ్మిది గ్రామ పంచాయతీల సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.12పంచాయతీల్లో పోటీలుండగా 28మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తికాగా తొమ్మిది పంచాయతీల్లో ఒక్కో అభ్యర్థి మాత్రమే నామినేషన్ మిగలడంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించామని ఎంపీడీవో పి. రఫీ ఖాన్ పేర్కొన్నారు.బట్టేపాడు సర్పంచ్ గా వాసిపల్లి ఆదిలక్ష్మమ్మ,చెర్లోయడవల్లి సర్పంచ్ గా తాటిపర్తి సుజాత, కనుపూరు పల్లి సర్పంచ్ గా ముళ్ళపూడి నరసింహయ్య, మహిమలూరు సర్పంచ్ గా మద్దినేని కల్పన, నాగులపాడు సర్పంచ్ గా సయ్యద్ నాయబ్ రసూల్, నారంపేట సర్పంచ్ గా చిట్టి మల్ల నాగ భవాని, రామస్వామి పల్లి సర్పంచ్ గా మెంతెం విష్ణువర్ధన్ రెడ్డి, రావులకొల్లు సర్పంచిగా సూరి పోగు బాబు, వాసిలి సర్పంచిగా సుంకర పెంచల చౌదరీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ తొమ్మిది పంచాయతీల్లో వాసిలి మినహా మిగతా ఎనిమిది పంచాయతీల్లో వార్డు మెంబర్లు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలో మొత్తం 21 గ్రామపంచాయతీలు ఉండగా తొమ్మిది పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగతా 12 పంచాయతీల్లో పోటీలు జరగనున్నాయి.
ఆత్మకూరు మండలంలో 12 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ 12 పంచాయతీల్లో మొత్తం 28 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు.అప్పారావు పాలెం పంచాయతీ నుండి కరేటి నరేష్, కొట్టే ప్రశాంతి, బొమ్మితొట్టి షాలిని, మావిళ్ళ రుక్మిణమ్మ లు పోటీలో ఉన్నారు. ఆరవేడు పంచాయతీలో తలచీరు రత్నమ్మ, గోగిరెడ్డి కవిత పోటీలో ఉన్నారు. బండారుపల్లి పంచాయతీలో కటారి అమ్మని, వంగళ్లు చిన్నక్క, పాణం పెంచలమ్మలు పోటీలో ఉన్నారు. బోయిల సిరివెళ్ల పంచాయతీలో రావూరు లావణ్య,మంతు ధనమ్మ పోటీలో ఉన్నారు. దేపూరు పంచాయతీలో అడ్డాల వెంకటరమణయ్య, ఇళ్ల పెంచలయ్య పోటీలో ఉన్నారు.కరటంపాడు పంచాయతీలు షేక్ సాబ్జాన్, షేక్ ఖాజామొహిద్దీన్ పోటీలో ఉన్నారు. మురుగళ్ల పంచాయతీలో కన్నె మరకల వెంగయ్య, తోడేటి పెంచల ప్రసాద్ పోటీలో ఉన్నారు. నల్లపురెడ్డి పల్లి పంచాయతీలో షేక్ దొరసానమ్మ, ప్రత్తిపాటి ప్రసాద్ లు పోటీలో ఉన్నారు. నువ్వురుపాడు పంచాయతీలో షేక్ రెహనా, షేక్ షాహినా పోటీలో ఉన్నారు.పడకండ్ల పంచాయతీలో పాశం పద్మ, పాలిచర్ల సుస్మిత పోటీలో ఉన్నారు. పమిడిపాడు పంచాయతీలో చెరుకూరు ధనమ్మ,బొల్లినేని కామాక్షమ్మ పోటీలో ఉన్నారు. వెన్నవాడ పంచాయతీలో ఏలూరు కిరణ్ కుమార్,పసుపులేటి శ్రీరామ్, దిసించర్ల రాజేష్ లు పోటీలో ఉన్నారు.
ఆత్మకూరు నియోజకవర్గంలో 135 గ్రామ పంచాయతీలు ఉండగా 52పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి.కూటమి బలపరిచిన వారే సర్పంచ్ లుగా, వార్డ్ మెంబర్లు గా ఎన్నికయ్యారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆశీస్సులు పొందినవారే సర్పంచ్ లుగా ఎన్నికయ్యారు.
*ఒక లైన్ అంతా ఏకగ్రీవాలే *
ఆత్మకూరు మండలంలో ఒక మార్గంలో ఉన్న అన్నీ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఈ మార్గంలో ఉన్న అన్ని పంచాయతీలు ఏకగ్రీవం కావడం విశేషం. ఆత్మకూరు -నాగులపాడు మార్గంలోని రావులకొల్లు, చెర్లో యడవల్లి, నాగులపాడు, మహిమలూరు, నారంపేట, రామస్వామిపల్లి పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మండలంలో 9పంచాయతీలు ఏకగ్రీవం కాగా అందులో ఆరు పంచాయతీలు ఓకే మార్గంలో ఉండడం విశేషం.