BREAKING
మా జట్టులో ఆడతావా.. రిషభ్ పంత్‌కు న్యూజిలాండ్ క్లబ్ క్రికెట్ టీమ్ ఆఫర్ తల్లి సర్పంచ్‌గా విజయం సాధించడంతో మాలకొండకు కుమారుడి పాదయాత్ర..! మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు గారిని కలిసిన వంగపాడు సర్పంచ్ పంచాయతీ ఎన్నికల్లో వింజమూరు లో హవా కొనసాగించిన వైసిపి కనుమర్లపూడి వారి వివాహ రిసెప్షన్ మహోత్సవంలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఉచిత పశు వైద్య శిబిరంతో రైతులకు ప్రయోజనం ఆస్ట్రేలియన్ ఓపెన్ 2027 నుంచి జన్నిక్ సినర్ అవుట్.. మోకాలి సర్జరీతో కీలక నిర్ణయం తూప్రాన్ లో ఎక్కడికక్కడే పేరుకుపోయిన చెత్తా చెదరం సైదాపురం మండలంలో 31 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల సందడి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సూపర్ లీగ్‌లోకి ముంబై.. అజేయ ప్రదర్శనతో దూసుకుపోతున్న జట్టు కారుణ్య నియామకంలో పబ్లిక్ హెల్త్ వర్కర్లుగా విధుల కేటాయింపు మూసాపేట, కోకాపేట నియోపొలిస్ భూములకు దాఖలు కాని బిడ్లు..ఉదయం, మధ్యాహ్నం విడతల్లో నిర్వహించిన ఈ–వేలం రద్దు తెలంగాణలో బీజేపీ బలోపేతమే లక్ష్యం : బీజేపీ సీనియర్​ నేత పెరిక సురేష్​ ప్రభుత్వ ఆస్తులకు బీజేపీ రంగులా?వాటర్ ట్యాంకర్ వ్యక్తిగత అవసరాలకు వినియోగం? పురుషులు, మహిళలు ఒకే జట్టుగా.. ఆగస్టు 2027లో 'ఈక్వల్' మిక్స్‌డ్ జెండర్ టీ20 లీగ్

హెచ్ఐవి-ఎయిడ్స్ పై అవగాహన...

Select Suryaa Now
హెచ్ఐవి-ఎయిడ్స్ పై అవగాహన...
సూర్య-నవీపేట్ ;;ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం డిసెంబర్ 01వ తేదీ సందర్భంగా స్వాతి ట్రస్ట్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో గల పలు పాఠశాలలో హెచ్ఐవి, ఎయిడ్స్ పై శుక్రవారం అవగాహన సదస్సులు నిర్వహించారు. విద్యార్థినీ, విద్యార్థులకు వ్యాధి ఏ విధంగా సక్రమిస్తుంది, వ్యాధి సక్రమించిన వారిని ఏ విధంగా చూడాలి, వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి స్వాతి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి ఓడ్డే రవి అవగాహన కల్పించారు. వికలాంగులు, అనాధలు, వితంతుల కోసం మా సంస్థ పని చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఎయిడ్స్ పట్ల సమాజంలో ఉన్న అపోహాలను తొలగించాల్సిన అవసరం ఉందని, అవగాహనతోనే ఈ మహమ్మారిని పూర్తిగా అరికట్టగలమని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుండే ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకోవాలని, హెచ్ఐవి బాధితుల పట్ల వివక్ష చూపకుండా వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగామణి, నరేష్, గోపాల్ రెడ్డి, స్వాతి ట్రస్ట్ ఉపాధ్యక్షులు పోసాని తదితరులు పాల్గొన్నారు.