జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తా
జెడ్పీ చైర్‌పర్సన్ శైలజ తేజోమూర్తి
చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్. జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తానని జెడ్పీ చైర్‌పర్సన్ శైలజ తేజోమూర్తి తెలిపారు. శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్ పర్సన్ ఛాంబర్ నందు పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తనకు అండగా నిలిచిన శ్రేయోభిలాషులు, చిత్తూరు జిల్లా నాయకులు, ఎమ్మెల్యేలు, మిత్రులు, జెడ్పీ కార్యాలయ సిబ్బంది, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు.దసరా సమయంలో ప్రారంభమైన ఈ ప్రక్రియ నెల రోజుల పాటు ఉత్కంఠభరితంగా సాగిందని, అంతిమంగా మంచి జరుగుతుందన్న నమ్మకంతో ముందుకు సాగామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ ఆశయాలు కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ప్రధానంగా విద్యా, వైద్య రంగాలతో పాటు మహిళలు, పిల్లల సంక్షేమం, రవాణా, కమ్యూనికేషన్ సేవల మెరుగుదలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అందరిని భాగస్వాములను చేస్తూ పనిచేస్తామని తెలిపారు. ఎల్ నినో ప్రభావం తర్వాత ఈ ప్రాంతంలో నీటి ఎద్దడి సమస్య ఎక్కువగా ఉందని, సమస్యలను దృష్టిలో ఉంచుకుని అందరం కలిసికట్టుగా స్థిరమైన పరిష్కారాల దిశగా కృషి చేస్తామని స్పష్టం చేశారు.చిత్తూరు జిల్లాను రాష్ట్ర, జాతీయ స్థాయిలో అభివృద్ధిలో ముందు వరుసలో నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని శైలజ తేజోమూర్తి కోరారు.ఈ కార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, జడ్.పి. సీఈవో రవికుమార్ నాయుడు, జడ్పీ కార్యాలయ సిబ్బంది, అభిమానులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.
ఉమా శంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.