మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన జడ్పిటిసి సభ్యులు......
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన జడ్పిటిసి సభ్యులు......
వరికుంటపాడు మేజర్ న్యూస్
వరికుంటపాడు మండలం విరువూరు గ్రామానికి చెందిన గుబిలి ఇజ్రాయిల్(43) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు గుబిలి ఇజ్రాయిల్ ఆటోను కొనుగోలు చేసి నెల అయింది. సర్వీసింగ్ కోసం బద్వేలు వెళ్లి తిరిగి వస్తుండగా విజయవాడ నుంచి ఒంటిమిట్ట వెళ్తున్న కారు వేగంగా ఆటోను బలంగా డీ కోటింది. ఢీకొనడంతో ఆటో డ్రైవర్ ఇజ్రాయిల్ అక్కడికక్కడే మృతి చెందగా పక్కనే ఉన్న తన కుమారునికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. కాగా శుక్రవారం రెండవ దశ పంచాయతీ ఎన్నికలు ముగింపు సందర్భంగా ప్రచారంలో పాల్గొన్న వరికుంటపాడు జడ్పిటిసి సభ్యులు మూలే హరితమ్మ బాలకృష్ణారెడ్డి దంపతులు ఆ మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మీ కుటుంబానికి అండగా ఉంటామని ఎలాంటి సహాయం అవసరమైన సంప్రదించవచ్చని భరోసాని ఇచ్చారు.ఈ సందర్భంగా కుటుంబ ఖర్చులకోసం 20000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆర్థిక సహాయాన్ని అందుకున్న కుటుంబ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. మృతునికి నలుగురు కుమారులు భార్య ఉన్నారు.