మార్కెట్ కమిటీ అభివృద్ధికి పాలకవర్గ సభ్యులతో కలిసి కృషి చేస్తా.…
నర్సాపూర్;మార్కెట్ కమిటీ అభివృద్ధికి అధికారులు, పాలకవర్గ సభ్యులతో సమన్వయం చేసుకుంటూ సమష్టిగా కృషి చేస్తానని నర్సాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుర్రాల మల్లేశం పేర్కొన్నారు శుక్రవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సకాలంలో చేరేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు.మార్కెట్ కమిటీ పరిధిలో రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, మార్కెట్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మార్కెట్ కమిటీ అధికారులు, పాలకవర్గ సభ్యుల సహకారంతో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.అదేవిధంగా మార్కెట్ కమిటీ దుకాణ సముదాయాలకు సంబంధించి గతంలో నిర్వహించిన టెండర్లకు టెండర్ దార్లు సకాలంలో రాని పక్షంలో రద్దు చేసి, తిరిగి నూతనంగా టెండర్లు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పారదర్శక విధానంలో టెండర్ల ప్రక్రియ చేపట్టి మార్కెట్ కమిటీ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చైర్మన్ గుర్రాల మల్లేశం స్పష్టం చేశారు…