BREAKING
మా జట్టులో ఆడతావా.. రిషభ్ పంత్‌కు న్యూజిలాండ్ క్లబ్ క్రికెట్ టీమ్ ఆఫర్ తల్లి సర్పంచ్‌గా విజయం సాధించడంతో మాలకొండకు కుమారుడి పాదయాత్ర..! మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు గారిని కలిసిన వంగపాడు సర్పంచ్ పంచాయతీ ఎన్నికల్లో వింజమూరు లో హవా కొనసాగించిన వైసిపి కనుమర్లపూడి వారి వివాహ రిసెప్షన్ మహోత్సవంలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఉచిత పశు వైద్య శిబిరంతో రైతులకు ప్రయోజనం ఆస్ట్రేలియన్ ఓపెన్ 2027 నుంచి జన్నిక్ సినర్ అవుట్.. మోకాలి సర్జరీతో కీలక నిర్ణయం తూప్రాన్ లో ఎక్కడికక్కడే పేరుకుపోయిన చెత్తా చెదరం సైదాపురం మండలంలో 31 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల సందడి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సూపర్ లీగ్‌లోకి ముంబై.. అజేయ ప్రదర్శనతో దూసుకుపోతున్న జట్టు కారుణ్య నియామకంలో పబ్లిక్ హెల్త్ వర్కర్లుగా విధుల కేటాయింపు మూసాపేట, కోకాపేట నియోపొలిస్ భూములకు దాఖలు కాని బిడ్లు..ఉదయం, మధ్యాహ్నం విడతల్లో నిర్వహించిన ఈ–వేలం రద్దు తెలంగాణలో బీజేపీ బలోపేతమే లక్ష్యం : బీజేపీ సీనియర్​ నేత పెరిక సురేష్​ ప్రభుత్వ ఆస్తులకు బీజేపీ రంగులా?వాటర్ ట్యాంకర్ వ్యక్తిగత అవసరాలకు వినియోగం? పురుషులు, మహిళలు ఒకే జట్టుగా.. ఆగస్టు 2027లో 'ఈక్వల్' మిక్స్‌డ్ జెండర్ టీ20 లీగ్

ఆర్ఈసిఎస్ లో అక్రమాలు నిజమే

Select Suryaa Now
ఆర్ఈసిఎస్ లో అక్రమాలు నిజమే

 

చీపురుపల్లి మేజర్ న్యూస్:

 చీపురుపల్లి ఆర్ఈసిఎస్ లో అప్పటి  మేనేజింగ్ డైరెక్టర్  పి. రమేష్ పై 59 మంది ఎనర్జీ అసిస్టెంట్ల నియామకంలో జరిగిన అవకతవకలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా విచారణ జరిపి రెండు వార్షిక ఇంక్రిమెంట్లు కోత విధిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలు పాటించకుండా రెస్కో లో నియామకాలు చేయడం, అభ్యర్థులను సక్రమంగా ఎంపిక చేయకపోవడం, నిర్దేశించిన విధానాలను అనుసరించకపోవడం, సరైన అనుమతి లేకుండా ముగ్గురు పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సేవలను కొనసాగించడం వంటి అభియోగాలు ఆయనపై ఉన్నాయి. విచారణ అధికారి అభియోగాలు రుజువు అయినట్టు నిర్ధారించారు. ప్రభుత్వం విచారణ నివేదిక, వివరణలు, రక్షణ వాదనలను పరిశీలించి, సంబంధిత అధికారి వాదనలను తిరస్కరించింది. ఈనెల 20న జి.ఓ.ఆర్.టి.నెం. 1073,  ద్వారా ప్రభుత్వం పూర్వపు ఎమ్ డి పి. రమేష్ పై రెండు వార్షిక గ్రేడ్ ఇంక్రిమెంట్లను సంచిత ప్రభావంతో  నిలిపివేసే శిక్షను విధించింది. తదుపరి చర్యలు తీసుకోవాలని సహకార సంఘాల కమిషనర్, రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.

...... ఎమ్ డి పై చర్యతో సరేనా....విజిలెన్స్ నివేదిక ఆధారంగా చర్యలుండవా...?

ఎట్టకేలకు అక్రమాలు జరిగిన ఆరేళ్ల తర్వాత ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆర్ఈసిఎస్ అప్పటి మేనేజింగ్ డైరెక్టర్, ప్రస్తుతం  జిల్లా సహకార అధికారి పిల్లి రమేష్ మీద ఉన్న ఆరోపణల్లో  ఉద్యోగ నియామకంలో అవకతవకలకు సంబంధించి రెస్కోలో 59 ఎనర్జీ అసిస్టెంట్ల పోస్టుల భర్తీలో నిబంధనలు, రిజర్వేషన్ పాటించలేదు. టెక్నికల్ టెస్ట్ లో భాగంగా పోల్ క్లైంబింగ్, సైక్లింగ్, మీటర్ రీడింగ్ వీడియో తీసినా సేవ్ చేయలేదు, 10వ తరగతిలో ఎక్కువ మార్కులు వచ్చిన వారిని వదిలేసి, తక్కువ మార్కులు వచ్చిన వారిని సెలెక్ట్ చేయడం వంటి ఆరోపణలు వచ్చాయి. అలగే  రిటైర్డ్ ఉద్యోగులను కొనసాగించడంలో ముగ్గురు 3 మంది విశ్రాంత ఉద్యోగులను తిరిగి నియమించడానికి రాష్ట్ర సహకార కమీషనర్, సహకార సంఘాల శాఖాధికారులు  తిరస్కరించినా, ఆయన వారి సేవలను కొనసాగించారు. అప్పట్లో విజిలెన్స్ అధికారులు విచారణ జరిపారు. ప్రభుత్వ ఆదేశాలు మేరకు ఆరోపణలుపై విశాఖపట్నం జిల్లా సహకార అధికారి  టి ప్రవీణ  విచారణ అధికారిగా విచారణ జరిపారు.  ఆరోపణలూ రుజువు అయ్యాయని నివేదిక ఇచ్చారు. ఆరోపణలు నిజం కాదంటూ పి రమేష్  దీనిని ఖండిస్తూ, ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదని, రెస్కో అనేది ప్రాథమిక సహకార సంఘం అని వివరణ ఇచ్చినా ప్రభుత్వం దీనిని తిరస్కరించింది.  ఆర్థిక నష్టం జరగకపోయినా, నిబంధనలు తప్పడం, మెరిట్‌ను తొక్కడం, ఉన్నతాధికారుల తిరస్కరణ ఉత్తర్వును ధిక్కరించడం అనేది తీవ్రమైన క్రమశిక్షణా ఉల్లంఘన అని ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండు  వార్షిక ఇంక్రిమెంట్లను సంచిత ప్రభావంతో  నిలిపివేయడం అంటే ఆయనకు రావాల్సిన రెండు ఇంక్రిమెంట్లు కట్ అవుతాయి, అది ఆయన జీతం మీద, భవిష్యత్తు పెన్షన్ మీద కూడా శాశ్వత ప్రభావం చూపుతుంది. ఈ ఉత్తర్వును అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర సహకార శాఖ కమిషనర్, రాష్ట్ర సహకార సంఘాల శాఖ అధికారులకి అప్పగించారు. అధికారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో ఇక ఉద్యోగాలు పొందిన వారిపై ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయనేది అంతుచిక్కని ప్రశ్నగా ఉంది.

రిపోర్టర్ మధు, చీపురుపల్లి, విజయనగరం జిల్లా