BREAKING
అవనిగడ్డలో వైఎస్సార్సీపీ అభ్యర్థుల తరఫున మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ప్రచారం మహాత్మా జ్యోతిబాపూలే సేవలు చిరస్మరణీయం జ్యోతిరావు పూలే ఆశయాల సాధనతోనే సమ సమాజ నిర్మాణం 161వ జాతీయ రహదారిపై వంతెన పై రెండు డివైడర్ల మధ్యన ఇరుక్కున్న లారీ.తప్పిన ప్రమాదం.. రేవంత్ రెడ్డికి బీజేపీని విమర్శించే హక్కు లేదు ఎలినో ప్రభావం తో వర్షభావం... ఎండిపోతున్న పంటలు. ఘనంగా శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహాత్మా జ్యోతిబా ఫూలేకు ఘన నివాళి బీసీ మహిళలకు జనాభా నిష్పత్తి ప్రకారం 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి ప్రభుత్వ విప్ జగదీశ్వరిని కలిసిన సంతోషపురం సర్పంచ్ ????️ భగవంతుని సంకల్పమే… నా శివకోటి దీక్షకు ప్రేరణ! పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి ఇంపీరియల్ బ్రాండ్స్ కొనుగోలుపై ఆల్ట్రియా కన్ను.. ఆల్-క్యాష్ బిడ్ దిశగా కదలికలు మాజీ మంత్రిని కలిసిన ఉద్యమకారుడు..! పెదభోగిల గ్రామస్తులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా! అయ్యప్ప సేవలోనే జీవితాన్ని అంకితం చేసిన సాహితీ రాము గురుస్వామి

 పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదు : జిల్లా కలెక్టర్ శ్రీ.పి. రాజాబాబు

Select Suryaa Now
 పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదు :  జిల్లా కలెక్టర్ శ్రీ.పి. రాజాబాబు

ఒంగోలు, మేజర్‌న్యూస్‌ :

 పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని జిల్లా కలెక్టర్ శ్రీ.పి. రాజాబాబు స్పష్టం చేశారు. ఈనెల 29వ తేదీన రెండవ విడత పంచాయతీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో శుక్రవారం ప్రకాశం భవనం నుంచి ఆర్వోలు, పిఓలు, ఎంపీడీవోలు, మైక్రో అబ్జర్వర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు, పోలింగ్ సామగ్రితో ముందు రోజే అక్కడికి చేరుకోవటం, సకాలంలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం, నిబంధనల మేరకు పోలింగ్ కేంద్రాలలోకి అనుమతులు, ఎన్నికల సంఘం నిర్దేశం ప్రకారం ఓట్ల లెక్కింపు, ఫలితాలను జాప్యం చేయకుండా స్వర్ణ పంచాయతీ వెబ్ సైట్ లో నమోదు చేయటం, తదితర అంశాలపై ఆయన దిశా నిర్దేశం చేశారు. పోలింగ్ విధులలో పాల్గొంటున్న సిబ్బందికి ఇప్పటికే విడతల వారీగా అవసరమైన శిక్షణ ఇచ్చినందున ఎలాంటి లోపాలు లేకుండా ఈ ప్రక్రియను నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి పరిస్థితిని మైక్రో అబ్జర్వర్లు కూడా నిశితంగా పరిశీలించాలని కలెక్టర్ చెప్పారు. 
            ఈ సమావేశంలో డిఆర్ఓ పి.వెంకటరమణ, జిల్లా ఎన్నికల నోడల్ ఆఫీసర్ ఎం.వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.