గంజాయి, మత్తుమందులు, నార్కోటిక్ డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి
- వైద్య అధికారులు పి పావని. ఉషారాణి.
సీతానగరం నవంబర్ 28 మేజర్ న్యూస్......గంజాయి, మత్తుమందులు, నార్కోటిక్ డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని వైద్యాధికారులు పి పావని. ఉషారాణి అన్నారు. ఈ మేరకు సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో సీతానగరం ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో యువత, విద్యార్థులు మరియు ప్రజలలో మాదకద్రవ్యాల (గంజాయి, మత్తుమందులు, సింథటిక్ డ్రగ్స్) వల్ల కలిగే శారీరక, మానసిక మరియు సామాజిక దుష్ప్రభావాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు మాట్లాడుతూ దేశానికి వెన్నుముక అయినటువంటి యువత వీటికి అలవాటు పడి అవి లేకపోతే జీవితమే లేదని అన్నట్టుగా తయారవుతారని.పిల్లల ప్రవర్తనలో మార్పులు అకస్మాత్తుగా కోపం రావడం, చదువులో వెనుకబడటం, ఒంటరిగా ఉండటం, డబ్బులు ఎక్కువగా అడగడం గమనించినప్పుడు వారిని శిక్షించకుండా కౌన్సెలింగ్ ఇప్పించాలని. మత్తు పదార్థాలు వల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, ఏకాగ్రత లోపించడం, మెదడు కణాలు దెబ్బతినడం.శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి, తరచూ అనారోగ్యానికి గురవడం, విపరీతంగా బరువు తగ్గడం లేదా కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీతానగరం ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ ఎస్సై సింహాచలం తో పాటు సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది పాల్గొన్నారు.