జిల్లా స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో నిజాంపేట పీఎం శ్రీ విద్యార్థుల ప్రతిభ
రామాయంపేట;చేగుంటలో శనివారం నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) ఫెన్సింగ్ రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీల్లో నిజాంపేట పీఎం శ్రీ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్ఞానమాల, పీడీ ప్రవీణ్ సంయుక్త ప్రకటనలో వెల్లడించారు.
ఎంపికైన విద్యార్థుల వివరాలు:
అండర్-14 బాలికలు:
\- ఈపీ విభాగంలో టి. శాన్విక.
అండర్-14 బాలురు:
* ఫాయిల్ విభాగంలో జి. నవదీప్ గౌడ్.
* ఈపీ విభాగంలో జి. మహేందర్.
* సాబర్ విభాగంలో చి. వేణు.
అండర్-17 బాలికలు:
* ఫాయిల్ విభాగంలో బి. కీర్తన, వి. భవాని, జె. రాణి, ఎస్. ఐశ్వర్య.
* ఈపీ విభాగంలో ఎం. సహస్ర.
* సాబర్ విభాగంలో ఎల్. జెస్సికా.
ఎంపికైన విద్యార్థులు కరీంనగర్ జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొననున్నారని తెలిపారు. విద్యార్థులు జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.