చదువుతోపాటు క్రీడలలో పోటీ తత్వం ఉండాలి ఎంపీ రఘునందన్ రావు
చేగుంట;విద్యార్థులు చదువులో, క్రీడలలో పోటీ తత్వాన్ని కలిగి ఉండాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. శనివారం చేగుంట లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి అండర్ 14,అండర్ 17, అండర్ 19 బాల బాలికల ఫెన్సింగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. క్రీడల వల్ల ఆరోగ్యంతో పాటు ఉపాధి, ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు రెండు శాతం కోట ఉంటుందని, అది ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. విద్యార్థులు తమకు నచ్చిన క్రీడలలో ప్రావీణ్యతను సంపాదించి ఊరుకు, చదువుతున్న పాఠశాలకు,కళాశాలలకు,జిల్లాకు, రాష్ట్రానికి,దేశానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్రీడలకు ప్రాధాన్యతని తేలు ఇండియా పోటీలను ప్రవేశపెట్టారని, దాని ద్వారా ఎంతో మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని దేశానికి ఎన్నో పథకాలు సాధించాలని అన్నారు. అదేవిధంగా విద్యార్థులు తమకు నచ్చిన క్రీడలో భవిష్యత్తుకు మాటలు వేసుకోవాలని తెలిపారు. అండర్ 14 బాలికల ఫైల్ విభాగంలో అస్మిత, ఆధ్యా,శశి,షాలిని, విగ్నేశ్వరి,సాబీర్ విభాగంలో జ్యోతి, శరణ్య,హాసిని, స్వాతి,ఈపీ విభాగంలో మహిమ, జయలక్ష్మి,సారిక,సాన్విక లు, అండర్ 14 బాలుర ఫాయిల్ విభాగంలో లక్కీ,అజయ్,నవతేజ్,నవదీప్,సాబీర్ విభాగంలో భరత్,మనోజ్,హర్షవర్ధన్,ప్రణీత్,ఈపి వీభాగంలో మహేందర్, భరత్ రాజ్, హరికృష్ణ,సాత్విక్ లు, అండర్ 17 బాలికల ఫైల్ విభాగంలో కీర్తన, భవాని,ఎస్తేరు రాణి,ఐశ్వర్య,సాబీర్ విభాగంలో జెస్సిక,అనురాధ,వర్ష,అలేఖ్య , ఈ పివి భాగంలో సహస్ర, దీప్తి,ఐశ్వర్య,కనకలక్ష్మిలు, అండర్ 17 బాలుర ఫైల్ విభాగంలో భానుచరణ్,రంజిత్ కుమార్,రాహుల్,పండు,సాబేర్ విభాగంలో రాకేష్, చరణ్,అరవింద్,ఆంజనేయులు,ఈపీవీ రిత్విక్,రాఘవేందర్,వినయ్ కుమార్,రంజిత్ కుమార్,అండర్ 19 బాలికల బాయిల్ విభాగంలో భార్గవి,శ్రీజ,అశ్విత,ఎల్.శ్రీజ,సాబీర్ విభాగంలో నిఖిత,హరిప్రియ,గీతిక,అర్చన,ఈపీవీ భాగంలో నందిని,ఎస్తేరు రాణి,ధనలక్ష్మి, ఉషశ్రీ,అండర్ 19 బాలుర ఫాయిల విభాగంలో రాజేందర్,ప్రభాస్,స్టార్విన్,సాబేర్ విభాగంలో విత్తు, నరేష్,వరుణ్ సందేశ్, చైతన్య,ఈటీవీ భాగంలో చందు, అజయ్,ఫైజాన్,జగదీష్ లు గెలుపొందారని కోచ్ కర్ణం గణేష్ రవికుమార్ తెలిపారు. గెలిచిన వారందరూ డిసెంబర్ మొదటి వారంలో కరీంనగర్ జిల్లా రేకుర్తిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని ఆయన తెలిపారు.