ఘనంగా పరిగి ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
పూడూరు,మేజర్ న్యూస్:పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని శనివారం మండల పరిధిలోని మన్నెగూడ ఘనంగా నిర్వహించారు.హైదరాబాద్ నుంచి పరిగి వస్తున్న ఎంమ్మెల్యే ను మన్నెగూడ లో ఆపి ఆయనతో కేక్ కట్ చేయించి సంబరాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా పలువురు ఆయనకు కేక్ తినిపించి,శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం విద్యార్థులకు నోట్ బుక్స్,జామెట్రీ బుక్స్ లు పంపిణీ చేశారు.నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి పరిగి ప్రజలకు సేవ చేయాలని సొసైటీ చైర్మన్ రఘునాథ్ రెడ్డి,డీసీసీ ఉపాధ్యక్షులు కడుమూరు ఆనందం,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సురేందర్ మన్నెగూడ సర్పంచ్ అజీమ్ పటేల్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శులు షకీల్,శ్రీనివాస్,సర్పంచ్ అంబటి రాజు, ఎస్టీ సెల్ నాయకులు గోపాల్,నాయకులు నారాయణ,అబ్బాస్ ఖాన్,ఖలీల్ సొసైటీ డైరెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.