సమస్యాత్మక గ్రామాలలో పోలీసుల కవాతు: ఎస్సై అనిల్
ముప్పాళ్ళ,మేజర్ న్యూస్ : పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకొని మండలంలో సమస్యాత్మక గ్రామాలైన మాదల, చాగంటి వారి పాలెం, లంకెలకూరపాడు గ్రామాలలో పోలీసుల కవాతు నిర్వహించామని ఎస్సై పి అనిల్ తెలిపారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సై మాట్లాడుతూ ఎన్నికలలో ప్రశాంతమైన వాతావరణం కల్పించేందుకు, ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కును పౌరులు స్వేచ్ఛాయుతంగా వినియోగించుకునేందుకు పోలీసుల భద్రత ఉంటుందని భరోసాను కల్పించటమే ఈ కవాతు లక్ష్యం అన్నారు.ప్రజాస్వామ్యంలో ఓటర్లే కీలకమని ప్రజలందరూ తప్పనిసరిగా తమ ఓటును వినియోగించుకోవాలని ఆయన కోరారు.
గన్నవరం ఏలియ