డిసెంబర్ 1న పరకాల మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు-పరకాల మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు
పరకాల, మేజర్ న్యూస్, పరకాల మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా కార్తీక మాస వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.డిసెంబర్ 1 మంగళవారం రోజు పరకాలలోని అయ్యప్ప స్వామి దేవాలయం సమీపంలో, డాక్టర్ సంతోష్ కుమార్ తోట వద్ద గల ఆదిత్య డెవలపర్స్ ల్యాండ్స్‌లో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు పరకాల మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
మంగళవారం ఉదయం 9:30 గంటలకు గణపతి పూజ, గోమాత పూజ , నారాయణ పూజలతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలిపారు. మధ్యాహ్నం 1:30 గంటలకు కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు పురుషులు, మహిళలు, చిన్నారులకు వివిధ రకాల ఆటలు, పాటల పోటీలు నిర్వహించబడుతాయని వివరించారు.పరకాల పట్టణ మరియు మండల పరిధిలోని ఆర్యవైశ్య పెద్దలు, సోదర సోదరీమణులు, చిన్నారులు ఇతర కార్యక్రమాలను పక్కన పెట్టి, కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో తరలివచ్చి వనభోజన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు .