BREAKING
కొండగట్టు అంజన్నకు రాజన్న ఆలయం పట్టు వస్త్రాలు హుజురాబాద్ లో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ -- సూర్య వార్తకు స్పందన సబ్ జైలులో న్యాయవిజ్ఞాన సదస్సు రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వo ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి దీక్షా దివస్ సభను విజయవంతం చేయాలి -- ప్రజా సంఘాల జేఏసీ రైతులు కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి క్రీడల్లో రజిత పథకం పొందిన ఏసీపీ మాధవికి ఘన సన్మానం శ్రీకాంతాచారి ఫ్లెక్సీ తొలగింపుపై భగ్గుమన్న కాంగ్రెస్ అంబేద్కర్ 70వ వర్ధంతి సభను విజయవంతం చేయాలి చిన్నారుల ఆలోచనలకు రెక్కలు.. 250 అద్భుత ఆవిష్కరణలు! దీక్షా దివస్‌కు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలిరావాలి! గ్రంథపాలకుడు నాగవెల్లి రామ్ మోహన్‌కు ఘన వీడ్కోలు మహాత్మా జ్యోతిరావు ఫూలేకు బీజేపీ నేతల ఘన నివాళి దీక్షా దివస్‌కు యువత, బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలిరావాలి చల్లూరు నూతన సొసైటీ ఏర్పాటుపై ప్రత్యేక సర్వసభ్య సమావేశం

మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయాల సాధనకు కృషి చేయాలి

Select Suryaa Now
మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయాల సాధనకు కృషి చేయాలి
సూర్య, వీణవంక:మహాత్మా జ్యోతిరావు ఫూలే 136వ వర్ధంతి సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు బత్తిని నరేష్ గౌడ్ అధ్యక్షతన ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నరసింహ రాజు, ఓబీసీ మోర్చా కార్యదర్శి ముత్యాల రవీందర్ ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మహిళా విద్య, సామాజిక సమానత్వం, కుల వివక్ష నిర్మూలన కోసం ఫూలే దంపతులు చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. నేటి యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగడమే ఆ మహనీయుడికి అర్పించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దాట్ల వీరస్వామి, నాయకులు అప్పని కొమరయ్య, మడికొండ వెంకటేష్, గోపీనాథ్, మోటం శ్రీనివాస్, దామోదర్, బుర్ర సదానందం, తాళ్లపల్లి నాగరాజు, శ్రీనివాస్, రాకేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.