BREAKING
ఘనంగా ముగిసిన పాలిటెక్నిక్ క్రీడా సంబరాలు -ఓవరాల్ ఛాంపియన్‌గా మడకశిర పాలిటెక్నిక్ -వెటర్నరీ పాలిటెక్నిక్ క్రీడల్లో సత్తా చాటిన విద్యార్థులు ఘనంగా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు ఎంపికైన హర్షవర్ధన్ కు సన్మానం కొండగట్టు అంజన్నకు రాజన్న ఆలయం పట్టు వస్త్రాలు హుజురాబాద్ లో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ -- సూర్య వార్తకు స్పందన సబ్ జైలులో న్యాయవిజ్ఞాన సదస్సు రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వo ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి దీక్షా దివస్ సభను విజయవంతం చేయాలి -- ప్రజా సంఘాల జేఏసీ రైతులు కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి క్రీడల్లో రజిత పథకం పొందిన ఏసీపీ మాధవికి ఘన సన్మానం శ్రీకాంతాచారి ఫ్లెక్సీ తొలగింపుపై భగ్గుమన్న కాంగ్రెస్ అంబేద్కర్ 70వ వర్ధంతి సభను విజయవంతం చేయాలి చిన్నారుల ఆలోచనలకు రెక్కలు.. 250 అద్భుత ఆవిష్కరణలు! దీక్షా దివస్‌కు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలిరావాలి! గ్రంథపాలకుడు నాగవెల్లి రామ్ మోహన్‌కు ఘన వీడ్కోలు

దీక్షా దివస్‌కు యువత, బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలిరావాలి

Select Suryaa Now
దీక్షా దివస్‌కు యువత, బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలిరావాలి
సూర్య - మానకొండూర్ :తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటిచెప్పేలా ఆదివారం (నేడు) మధ్యాహ్నం 3 గంటల నుండి మానకొండూరులో నిర్వహించనున్న 'దీక్షా దివస్' బహిరంగ సభకు యువత, బీఆర్ఎస్ కార్యకర్తలు వేలాదిగా తరలిరావాలని బీఆర్ఎస్ మండల యువజన విభాగం అధ్యక్షుడు ఆడప శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన పార్టీ నాయకులతో కలిసి మానకొండూరులోని సభా స్థలిని పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.ఈ సందర్భంగా ఆడప శ్రీనివాస్ మాట్లాడుతూ.. మానకొండూరు గడ్డపై దీక్షా దివస్ సభ నిర్వహించడం ఎంతో గర్వకారణమని, ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఘన స్వాగతం పలకాలని కోరారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి కేసీఆర్ చేపట్టిన అమరణ దీక్ష చారిత్రక ఘట్టమని కొనియాడారు. కేసీఆర్ చేసిన ఆ మహోన్నత త్యాగం, పోరాట ఫలితంగానే నేడు మనకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని గుర్తు చేశారు.తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ఆ చారిత్రక ఘట్టాన్ని స్మరించుకుంటూ, కేసీఆర్‌కు కృతజ్ఞతగా ఈ దీక్షా దివస్ సభను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేడు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న ఈ సభలో మండల వ్యాప్తంగా ఉన్న యువజన సభ్యులు, బీఆర్ఎస్ శ్రేణులు, ఉద్యమకారులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆడప శ్రీనివాస్ కోరారు.