telangana
చల్లూరు నూతన సొసైటీ ఏర్పాటుపై ప్రత్యేక సర్వసభ్య సమావేశం
సూర్య, వీణవంక:వీణవంక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పునర్వ్యవస్థీకరణలో భాగంగా చల్లూరు కేంద్రంగా నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సంఘ కార్యదర్శి చందుపట్ల ప్రకాశ్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను నవంబర్ 28న జారీ చేసినట్లు పేర్కొన్నారు. నూతన సొసైటీ ఏర్పాటుపై సభ్యుల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తెలుసుకునేందుకు డిసెంబర్ 5న ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వీణవంక పీఏసీఎస్ సభ్యులు ఈ సమావేశానికి హాజరై తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు.అలాగే సభ్యులు, ప్రజాప్రతినిధులకు ఏవైనా అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉంటే ప్రత్యేక సర్వసభ్య సమావేశం అనంతరం డిసెంబర్ 18లోపు కరీంనగర్ జిల్లా సహకార అధికారికి రాతపూర్వకంగా సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి అనుమతితో ఈ ప్రకటన విడుదల చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సంబంధిత నోటిఫికేషన్ ప్రతులను చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు మల్లయ్య గెల్లు, శ్యాంసుందర్ రెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు.