BREAKING
మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయాల సాధనకు కృషి చేయాలి ఉద్యోగులకు క్వార్టర్ల కేటాయింపు.. పారదర్శకంగా కౌన్సెలింగ్ క్వార్టర్లలో అక్రమ మోటార్ల తొలగింపు ఎన్నికలు వస్తాయి-పోతాయి.. బంధాలే శాశ్వతం..!! ఓసీపీ-3 సీహెచ్‌పీని సందర్శించిన డైరెక్టర్ తిరుమలరావు భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్జిత సేవలు తాత్కాలికంగా నిలిపివేత. అక్షర ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఘనంగా జాతీయ సైన్స్ డే ఎక్స్‌పో ఐఎఫ్ఎఫ్ఐ 2026 విజేతల జాబితా.. కాంతార చాప్టర్ 1కు రిషబ్ శెట్టి ఉత్తమ నటుడి అవార్డు చిన్న సినిమాలకు ప్రత్యేక థియేటర్ పాలసీ కావాలి.. షెరాజ్ మెహదీ డిమాండ్ విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయాలి బాలయ్య వివేక్ ఆత్రేయ కురుక్షేత్రం ప్రాజెక్టుకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా మురుగు నీటి నిల్వ.. దుర్వాసతో ప్రజల అవస్థలుపడుతున్నారు. దేశభక్తి నేపథ్యంలో మిసెస్ కల్నల్ టీజర్ విడుదల.. ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రోమో డిసెంబర్ 1న పరకాల మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు-పరకాల మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు తొలి వికలాంగ పింఛన్‌తో విద్యార్థులకు విద్యాసామగ్రి పంపిణీ.. చందు గొప్ప మనసు

తొలి వికలాంగ పింఛన్‌తో విద్యార్థులకు విద్యాసామగ్రి పంపిణీ.. చందు గొప్ప మనసు

Select Suryaa Now
తొలి వికలాంగ పింఛన్‌తో విద్యార్థులకు విద్యాసామగ్రి పంపిణీ.. చందు గొప్ప మనసు

కుల్కచర్ల, మేజర్ న్యూస్: చిన్న వయసులోనే సేవాభావాన్ని చాటుకుంటూ దానగల్ల చందు అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ప్రభుత్వం తనకు మంజూరు చేసిన తొలి వికలాంగ పింఛన్ రూ.4,016ను వ్యక్తిగత అవసరాలకు వినియోగించకుండా తోటి విద్యార్థుల చదువుకు ఖర్చు చేసి తన ఉదారతను చాటుకున్నాడు. కుల్కచర్ల మండలం చెల్లాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో శనివారం విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్లు, షార్ప్‌నర్లు తదితర విద్యాసామగ్రిని పంపిణీ చేశాడు.చెల్లాపూర్ గ్రామానికి చెందిన దానగల్ల నరేష్ కుమారుడైన చందుకు ప్రభుత్వం తొలిసారిగా రూ.4,016 వికలాంగ పింఛన్ మంజూరు చేసింది. తనకు వచ్చిన తొలి పింఛన్‌తో తోటి విద్యార్థులకు సాయం చేయాలనే మంచి ఆలోచనతో ఆ మొత్తాన్ని విద్యాసామగ్రి కొనుగోలుకు వెచ్చించాడు. చిన్న వయసులోనే ఇతరుల చదువుకు అండగా నిలవాలన్న అతని ఆలోచన పలువురిని ఆకట్టుకుంది.ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం చందు, అతని తండ్రి నరేష్‌ను ఘనంగా సన్మానించి అభినందించింది. తనకు అందిన ఆర్థిక సాయాన్ని ఇతరుల అభ్యున్నతికి వినియోగించడం అభినందనీయమని, చందు సేవాభావం సమాజానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తుప్పలి ఆనంద్ కుమార్, ఉపాధ్యాయులు శ్రీనివాసులు, దస్తయ్య, గ్రామస్తులు బెందురు వెంకటేష్, బొల్లు వెంకటేష్, మాలేల రమేష్, బాలయ్య, సత్యమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు.