విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయాలి
గీసుగొండ , మేజర్ న్యూస్, విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలని మాజీ డిఎఫ్ఓ పురుషోత్తం అన్నారు.మండలంలోని ఉషోదయ హైస్కూల్లో చెకుముకి సంబరాలు జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు గుగులోతు సుధాకర్ అధ్యక్షతన జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా..జిల్లా స్థాయి సైన్స్ పోటీలకు ముఖ్య అతిథిగా ఆయన హాజరైన పురుషోత్తం మాట్లాడుతూ...సామాన్య ప్రజానీకంలో శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించడానికి,బావి భారత పౌరులైన చిన్నారి విద్యార్థిని విద్యార్థులలో శాస్త్రీయ దృక్పధాన్ని అలవర్చుకునేలా చేయడానికి ఈ చెకుముకి సైన్స్ సంబరాలు దోహదప డతాయని అన్నారు.పాఠశాల స్థాయిలో జరిగినటువంటి చెకుముకి సైన్స్ సంబరాలలో తెలంగాణ రాష్ట్రం మొత్తంగా ఆరు లక్షల మంది విద్యార్థులు విద్యార్థులు పాల్గొనడం మండల స్థాయిలో జరిగిన చెకుముకి సైన్స్ సంబరాలలో 36వేల మంది విద్యార్థులు పాల్గొనడం జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలలో 12,000 మంది విద్యార్థులు పాల్గొంటుండడం చాలా గొప్ప కార్యక్రమం అని అభివర్ణించారు.1994లో ప్రారంభమైన చెకుముకి సైన్స్ సంబరాలు నేటి వరకు ఎలాంటి ఆటంకం లేకుండా లక్షలాదిమంది విద్యార్థులలో చైతన్యాన్ని కలిగించేలా కొనసాగుతుండడం బృహత్ కార్యక్రమాన్ని అభిమానించారు.చిన్నారి విద్యార్థిని విద్యార్థులలో సైన్స్ పట్ల ఆసక్తిని కలిగించడానికి సృజనాత్మకతను పెంపొందించడానికి వారిలో దాగి ఉన్న అంతర్గత శక్తులను వెలికి తీసేందుకు చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహిస్తున్నామని,ఎందుకు జనవిజ్ఞాన వేదికన అభినందించాలని అన్నారు.ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసిన మండల విద్యాశాఖ అధికారి రవీందర్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు ఉపయోగపడేటువంటి చెకుముకి సైన్స్ సంబరాలు ఇంత ఘనంగా జరగడం స్ఫూర్తిదాయకంగా నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులు అందరికి పేరుపేరునా అభినందనలు తెలిపారు.ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా చెక్కుమకి సైన్స్ సంబరాలను అంబరాన్ని అంటే విధంగా నిర్వహించాలని అభిలాషించారు.
తదనంతరం జన విజ్ఞాన వేదిక వరంగల్ జిల్లా కమిటీ గౌరవాధ్యక్షులు ఐ.రామకృష్ణ చారి మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక సైన్స్ చైతన్య కార్యక్రమాలను ఒక మహోద్యమంగా నిర్వహిస్తున్నదని,పాఠ్య పుస్తకాలలోని అంశాలను ఇతర సామాజిక అంశాలను జోడించి జీవితానికి కావలసినటువంటి నిత్యజీవిత సైన్స్ ను విద్యార్థిని విద్యార్థులకు అందించడంలో జన విజ్ఞాన వేదిక ముందుంటున్నదని పేర్కొన్నారు.ప్రారంభ సమావేశంలో ఉషోదయ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ రిలేటెడ్ నాటికలు పర్యావరణ సంబంధిత ముత్యాలు సమావేశంలోని ప్రతి ఒక్కరిని తన్మయత్నం పొందేలాగా చేశాయి.ప్రారంభ సమావేశం తర్వాత మండల స్థాయిలో ప్రధములుగా నిలిచి జిల్లా స్థాయికి విచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ ను నిర్వహించారు.ప్రథమ ద్వితీయ స్థానాల్లో నిలిచినటువంటి విద్యార్థులకు విజువల్ రౌండ్,రాపిడ్ క్విజ్, యాక్టివిటీ రౌండ్, ఎక్స్పెరిమెంటల్ రౌండ్స్ నిర్వహించి ఈ ఐదు రౌండ్లలో అత్యధిక మార్కులు సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థులను రాష్ట్రస్థాయిలో జరిగే చకుముకి సైన్స్ సంబరాలకు ఎంపిక చేశారు విద్యార్థులు టాలెంట్ టెస్ట్ రాస్తున్న సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల కోసం విద్యావేత్తలతో పర్యావరణవేత్తలతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. కాగా ఉషోదయ హై స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన నృత్య నాటిక ఒక ప్రత్యేక ఆకర్షణీయంగా ఆదర్శనీయమైనదిగా నిలిచింది.భోజన విరామ అనంతరం జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు ముగింపు సమావేశం మరింత స్ఫూర్తిదాయకంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ విద్యావేత్త డాక్టర్ వేములపల్లి సుబ్బారావు మాట్లాడుతూ..విద్యార్థిని విద్యార్థులు భవిష్యత్తులో సైంటిస్టులుగా విద్యావేత్తలుగా ఎదిగి భారతదేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని,సివి రామన్ లాగా నోబెల్ బహుమతులను సాధించాలని ఉద్బోధించారు.ఈ కార్యక్రమలో ఆదర్శ గ్రామం గంగదేవి పల్లె గ్రామ సర్పంచ్ కూసం స్వరూప రమేష,జెవివి వరంగల్ ఉపాధ్యక్షురాలు వి.మాధవి రెడ్డి,పాఠశాల డైరెక్టర్ జి.రాహుల్ వర్మ,ప్రిన్సిపల్ మహేష్,జె లవి వి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాక శ్రీనివాస్,మూతి ఇంద్రసేనారెడ్డి,డాక్టర్ పెండెం భాస్కర్,రిసోర్స్ పర్సన్స్ సురేష్, శ్యాంసుందర్,భాస్కర్,కోశాధికారి బూర్గు నవీన్,ప్రముఖ న్యాయవాది సునీత,ప్రధాన కార్యదర్శి కుమారస్వామి, పాల కుమారస్వామి వివిధ మండలాల కన్వీనర్స్ గైడ్ టీచర్స్ వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
రిపోర్టర్ ;విష్ణు చందర్, గీసుకొండ, వరంగల్ జిల్లా